త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahajungle Raj | బెంగాల్‌లో టీఎంసీ ‘మహా జంగిల్ రాజ్’ అంతం కావాలి : ప్రధాని మోదీ

అస్సాం అభివృద్ధిలో మరో కీలక అడుగు. కాజీరంగా కారిడార్‌తో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించి, అమృత్ భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు.

J

National | Published On Jan 18, 2026, 5.05 pm IST

Mahajungle Raj | బెంగాల్‌లో టీఎంసీ ‘మహా జంగిల్ రాజ్’ అంతం కావాలి : ప్రధాని మోదీ

సంక్షిప్త సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా రాష్ట్రానికి భారీ వరాలు ప్రకటించారు. వన్యప్రాణుల రక్షణ కోసం కాజీరంగా కారిడార్‌ను ప్రారంభించడంతో పాటు, సామాన్యుల కోసం అత్యాధునిక 'అమృత్ భారత్' రైళ్లను జాతికి అంకితం చేశారు. ఈశాన్య రాష్ట్రాల అనుసంధానమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

Advertisement

Mahajungle Raj | భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించారు. ఒకవైపు ఎన్నికల రణక్షేత్రమైన బెంగాల్‌లో రాజకీయ విమర్శలు గుప్పిస్తూనే, మరోవైపు అస్సాంలో భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

ఈసందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర యువత భవిష్యత్తును ప్రభుత్వం అంధకారంలో నెడుతోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా తాము పీఎం శ్రీ స్కూల్స్‌ను తీసుకొస్తే టీఎంసీ మాత్రం పశ్చిమ బెంగాల్‌లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా చేసేందుకు పీఎం శ్రీ స్కూల్స్‌ను తిరస్కరిస్తోందన్నారు. అందుకే పశ్చిమ బెంగాల్‌లో మార్పు అవసరం అని మోదీ నొక్కి చెప్పారు. వెస్ట్ బెంగాల్ యూత్ భవిష్యత్తు బాగుండాలంటే, మంచి అవకాశాలు రావాలంటే బెంగాల్‌లో మార్పు అనివార్యం అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, టీఎంసీ నాయకులు 'మహా జంగిల్ రాజ్' నడుపుతున్నారని మండిపడ్డారు. సింగూర్ చరిత్రాత్మక గడ్డ అని, ఇక్కడి నుంచే మార్పు మొదలవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. బెంగాల్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.

అస్సాంకు రైల్వే, పర్యాటక వరాలు

అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రపంచ ప్రసిద్ధ కాజీరంగా నేషనల్ పార్క్ వద్ద రూ.6950 కోట్లతో నిర్మించిన ప్రత్యేక కారిడార్‌ను ఆయన ప్రారంభించారు. ఇది వన్యప్రాణుల రక్షణకు, పర్యాటక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం, అస్సాం మీదుగా ప్రయాణించే 'అమృత్ భారత్' రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లు తక్కువ ధరకే సామాన్య ప్రయాణికులకు విమాన స్థాయి సౌకర్యాలను అందిస్తాయని మోదీ వివరించారు.

ఈ పర్యటనలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈశాన్య భారతం నేడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు.

Advertisement

తాజావార్తలు

Advertisement