త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assam Election Results | అస్సాంలో వ‌రుస‌గా మూడోసారి అధికారం.. స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో బీజేపీ 

Assam Election Results | అస్సాంలో త‌మ‌కు తిరుగులేద‌ని (Assam Election Results) బీజేపీ మ‌రోసారి నిరూపించింది. వ‌రుస‌గా మూడోసారి అధికారంలోకి రానుంది. సీఎం హిమంత బిస్వ‌శ‌ర్మ (Himanta Biswa Sarma) నేతృత్వంలో బీజేపీ (BJP) స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో దూసుకుపోతున్న‌ది.

G

National | Published On May 4, 2026, 11.14 am IST

Assam Election Results | అస్సాంలో వ‌రుస‌గా మూడోసారి అధికారం.. స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో బీజేపీ 
Advertisement

Assam Election Results | త్రినేత్ర‌.న్యూస్‌: అస్సాంలో త‌మ‌కు తిరుగులేద‌ని (Assam Election Results) బీజేపీ మ‌రోసారి నిరూపించింది. వ‌రుస‌గా మూడోసారి అధికారంలోకి రానుంది. సీఎం హిమంత బిస్వ‌శ‌ర్మ (Himanta Biswa Sarma) నేతృత్వంలో బీజేపీ (BJP) స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో దూసుకుపోతున్న‌ది. మొత్తం 126 స్థానాల్లో క‌మ‌లం పార్టీ 88 స్థానాల్లో లీడ్‌లో ఉన్న‌ది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్ 64 స్థానాల‌ను దాటేసింది.

ప‌దేండ్ల క్రితం అధికారానికి దూర‌మైన‌ కాంగ్రెస్.. ఈ సారైనా సీఎం ప‌ద‌విని ద‌క్కించుకోవాల‌న్న క‌ల‌లు మ‌రోసారి నెర‌వేరకుండానే పోయాయి. కేవలం 26 స్థానాల‌తోనే ఆపార్టీ స‌రిపెట్టుకున్న‌ది.

కాగా, అస్సాం అసెంబ్లీ ఎన్నిక‌లు ఏప్రిల్ 9న జ‌రిగాయి. మొత్తం 722 మంది అభ్యర్థులు పోటీచేశారు. ఎన్టీఏ కూట‌మిలో బీజేపీ 90 మంది అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలుప‌గా, అస్సాం ఘ‌న ప‌రిష‌త్ (ఏజీపీ) 26, బోడో పీపుల్స్ ఫ్రంట్ (BPF) 11 స్థానాల్లో పోటీ చేసింది. ఇక కాంగ్రెస్ కూట‌మిలో ఆ పార్టీ 99 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిలుప‌గా, రాయ్‌జోర్ ద‌ల్ 13, అస్సామ్ జాతీయ ప‌రిష‌ద్ 10, ఏపీహెచ్ఎల్‌సీ ఇద్ద‌రిని పోటీలో ఉంచింది.

అయితే ఎన్డీఏదే మ‌రోసారి అధికార‌మ‌ని ఎగ్జిట్ పోల్స్ స్ప‌ష్టం చేశాయి. బీజేపీ 88 నుంచి 100 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్ కూట‌మి 24 నుంచి 36 సీట్ల‌కు ప‌రిమిత‌మ‌వుతుంద‌ని వెల్ల‌డించాయి.

 

Advertisement
Advertisement