త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assam | అస్సాంలో తిరుగులేని హిమంత‌.. పెరిగిన బీజేపీ బ‌లం

G

National | Published On May 4, 2026, 12.01 pm IST

Assam | అస్సాంలో తిరుగులేని హిమంత‌.. పెరిగిన బీజేపీ బ‌లం
Advertisement

Assam | త్రినేత్ర‌.న్యూస్‌: అస్సాంలో (Assam) మ‌రోసారి కాషాయ జెండా ఎగుర‌నుంది. ముఖ్య‌మంత్రి హిమంత బిస్వ శ‌ర్మ (Himanta Biswa Sarma) త‌న‌పై బీజేపీ అధిష్టానం న‌మ్మ‌కాన్ని నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో వ‌రుస‌గా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. గ‌తంలో 73 స్థానాల‌కే ప‌రిమిత‌మైన బీజేపీ (BJP).. ఈ ప‌ర్యాయం త‌న బ‌లాన్ని మరింత పెంచుకుని 100 స్థానాల‌కు చేరువ‌లో ఉన్న‌ది. దీంతో అధికారంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న‌ కాంగ్రెస్‌ మ‌ళ్లీ విపక్షానికే ప‌రిమిత‌మైంది.

కాంగ్రెస్ పార్టీతో త‌న రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హిమంత బిస్వ శ‌ర్మ‌.. అదే పార్టీ రెండు ప‌ర్యాయాలు బీజేపీకి తిరుగులేని విజ‌యాలు సాధించింపెట్టారు. 1996లో కాంగ్రెస్ పార్టీలో చేరిన హిమంత 2001లో తొలిసారిగా జ‌ల‌క్‌బ‌రి అసెంబ్లీ స్థానం నుంచి పోటిచేసి ఏజీపీ అభ్య‌ర్థి బ్రిగు కుమార్ ఫుకెన్‌పై విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత 2006, 2011 ఎన్నిక‌ల్లో 78 వేల పైచిలుకు ఓట్ల‌తో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. త‌రుణ్ గొగోయి మంత్రివ‌ర్గంలో ఆర్థిక మంత్రిగా, వైద్య‌, విద్య శాఖ మంత్రిగా ప‌నిచేశారు. అయితే 2015లో అప్ప‌టి సీఎం త‌రుణ్ గొగోయితో విభేదాల కార‌ణంగా 10 ఎమ్మెల్యేల‌తో క‌లిసి బీజేపీలో చేరారు. అనంత‌రం 2021లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచి అస్సాం 15వ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తాజాగా మ‌రోసారి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి వ‌రుస‌గా రెండో సారీ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్ట‌నున్నారు.

కాగా, ప్ర‌స్తుతం ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు బీజేపీ కూట‌మి 98 స్థానాల్లో ఆధిక్యంలో ఉండ‌గా, కాంగ్రెస్ అభ్య‌ర్థులు 26 చోట్ల మెజార్టీలో కొన‌సాగుతున్న‌ది. ఇత‌రులు 2 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. అయితే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల కంటే బీజేపీ 26 స్థానాల‌ను మెరుగుప‌రుచుకోగా, కాంగ్రెస్ మాత్రం 6 స్థానాల‌ను కోల్పోయింది.

Advertisement
Advertisement