BJP MLA | సీపీఎం విమర్శలను తిప్పికొట్టకుండా.. రీల్స్, సెల్ఫ్ ప్రమోషన్‌లో బిజీ.. .. సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు
BJP MLA | పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) తొలిసారి అధికారం దక్కించుకున్న బీజేపీలో (BJP MLA) అప్పుడే అసమ్మతి మొదలైంది. పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. రాష్ట్ర నాయకత్వంలోని ఒక వర్గంపై సొంత పార్టీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ సాఖా (MLA Amarnath Sakha) విమర్శలు గుప్పించారు.
BJP MLA | త్రినేత్ర.న్యూస్: పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) తొలిసారి అధికారం దక్కించుకున్న బీజేపీలో (BJP MLA) అప్పుడే అసమ్మతి మొదలైంది. పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. రాష్ట్ర నాయకత్వంలోని ఒక వర్గంపై సొంత పార్టీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ సాఖా (MLA Amarnath Sakha) విమర్శలు గుప్పించారు. సీపీఎం (CPM) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ రోజురోజుకూ పుంజుకుంటున్నా.. దాన్ని తిప్పికొట్టడం మానేసి, కొంతమంది బీజేపీ నేతలు కేవలం సొంత ప్రచారం (Self Promotion) , రీల్స్ చేయడం, ఫాలోవర్లను పెంచుకోవడం, ఫ్యాన్ క్లబ్‌లను (Fan Clubs) నిర్మించుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. బంకురా జిల్లాలోని ఓండా నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అమర్‌నాథ్ సఖా సోంత పార్టీ నేతలపై ఫేస్‌బుక్ వేదిక మండిపడ్డారు.
తాను చాలా కాలంగా బీజేపీతో అనుబంధం కలిగి ఉన్నాను. తప్పు అనిపించిన విషయాలపై మౌనంగా ఉండలేను. తాను ఎవరినీ ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించను. ఏది తప్పనిపించినా ఎత్తిచూపుతా. దీనివల్ల నాకు చాలా మంది శత్రువులు తయారయ్యారు. కానీ అది నాకు ముఖ్యం కాదు.. అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
లెఫ్ట్ ఫ్రంట్ ఎదుగుదలపై ఆందోళన
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కమ్యూనిస్ట్ కూటమి (Left Front) ప్రజలను రెచ్చగొట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రతికూల అభిప్రాయాన్ని సృష్టిస్తున్నదని ఆరోపించారు. కానీ బీజేపీ సీనియర్ నాయకులు ఎవరూ దీనిని అడ్డుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. సీపీఎం కార్యకలాపాలను అడ్డుకుని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి బదులు బీజేపీ నాయకులు సొంత ప్రచారంలో మునిగిపోతున్నారని మండిపడ్డారు.
పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సొంత ప్రచారంలోనే బిజీగా గడుపుతున్నారు. సీపీఎం ఆరోపణలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వడం లేదు, నిరసనలు లేవు, ఏమీ లేవని విమర్శించారు. `ఇక్కడ ప్రతి ఒక్కరూ రీల్స్ (Reels) చేయడం, ఫాలోవర్లను పెంచుకోవడం, ఫ్యాన్ క్లబ్‌లను పెంచడంలోనే బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కొందరు బీజేపీ నేతలు పార్టీ అభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం
- ●Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్

Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు






