Chaiti Durga Temple | గంగా నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన వందేండ్ల నాటి చైతీ దుర్గా ఆలయం
Chaiti Durga Temple | బీహార్‌లోని భాగల్‌పూర్ (Bhagalpur) జిల్లాలో ఉన్న వందేండ్ల నాటి చైతీ దుర్గా ఆలయం (Chaiti Durga Temple) గంగమ్మ ఒడిలో కలిసిపోయింది. నవగాచియాలోని రాఘోపూర్‌లో (Raghopur) ఉన్న ఈ సాంస్కృతిక వారసత్వ కట్టడం గంగా నది ఉధృతికి (Ganga Erosion) కొట్టుకుపోయింది.
Chaiti Durga Temple | త్రినేత్ర.న్యూస్: బీహార్‌లోని భాగల్‌పూర్ (Bhagalpur) జిల్లాలో ఉన్న వందేండ్ల నాటి చైతీ దుర్గా ఆలయం (Chaiti Durga Temple) గంగమ్మ ఒడిలో కలిసిపోయింది. నవగాచియాలోని రాఘోపూర్‌లో (Raghopur) ఉన్న ఈ సాంస్కృతిక వారసత్వ కట్టడం గంగా నది ఉధృతికి (Ganga Erosion) కొట్టుకుపోయింది. గంగా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి రక్షణగా జమీందారి కట్టను నిర్మించారు. అయితే నదీ ప్రవాహానికి రక్షణ కట్ట (Embankment) కోతకు గురైంది. దీంతో వందేండ్ల నాటి దుర్గమ్మ ఆలయం జనం చూస్తుండగా గంగా నదీప్రవాహంలో (Ganga River) కలిసిపోయింది. గుడితోపాటు పదికిపైగా ఇండ్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. శతాబ్దం క్రితం నిర్మించిన ఈ పురాతన ఆలయం చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా, సాంస్కృతిక వారసత్వంగా వెలుగొందుతున్నది.
ఈ ఆలయం గంగలో కలిసిపోయిందనే వార్త వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్ట వద్ద చాలా రోజులుగా భూకోత జరుగుతున్నప్పటికీ, అధికారులు సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే పరిస్థితి దారుణంగా తయారైందని ఆరోపిస్తున్నారు.
రాఘోపూర్ జమీందారీ కట్ట ప్రాంతం మొదటి నుంచీ గంగానది భూకోత ముప్పును (Severe Erosion) ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఏకంగా ఆలయమే కొట్టుకుపోవడంతో, చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాల భద్రత, కట్ట మనుగడపై స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం యంత్రాంగం, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో భూకోత నివారణ పనులు జరుగుతున్నప్పటికీ, గంగ ఉధృతి ముందు ఆ ప్రయత్నాలు తీవ్ర సవాలుగా మారాయి.

బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌదరి ఈ ఘటనపై స్పందిస్తూ.. రాఘోపూర్‌లో పరిస్థితి క్లిష్టంగా మారిందని చెప్పారు. గంగా నది ఉగ్రరూపం దాల్చడంతో పెద్ద ఎత్తున భూమి కోతకు గురవుతున్నదని తెలిపారు. ఎంతో ప్రసిద్ధి చెందిన దాదాపు శతాబ్ద కాలం నాటి చైతీ దుర్గా దేవి ఆలయం కూడా నదిలో కొట్టుకుపోయిందన్నారు. గంగానది ప్రవాహంలో అనూహ్య మార్పుల వల్ల పరిస్థితి తీవ్రంగా మారిందని చెప్పారు. పలుచోట్ల నదీ కోత తీవ్ర ఒత్తిడి ప్రాంతాలను (Pressure Points) సృష్టించిందని, జలవనరుల శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండి కోతను అరికట్టేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. గంగానది ప్రవాహంలో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వెల్లడించారు.
మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యమైన వస్తువులు, పశువుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని భాగల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే సూచించారు. పుకార్లను నమ్మవద్దని, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన అన్ని సహాయ, సహాయక చర్యలు చేపడతామని చెప్పారు.
#BREAKING A 100-year-old Chaiti Durga Temple in Raghopur, Bhagalpur, collapsed into the fierce currents of the Ganges due to severe river erosion. #Bhagalpur #GangaErosion #BiharNews #Raghopur @samrat4bjp @DistrictBhagalpur pic.twitter.com/dmrDDSgE4g
— jarvis ☠️ (@Vishii14) September 1, 2026
తాజావార్తలు
- ●CPCB Recruitment | పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండా ఎంపిక
- ●Horoscope | సెప్టెంబర్ 2 రాశిఫలాలు.. ఈ రాశి వారు మాటతీరుతో లాభం పొందుతారు!
- ●Tolichowki SI | రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టోలిచౌకి ఎస్ఐ
- ●Telangana | తెలంగాణలో క్రిటికల్ మినరల్స్‌పై పరిశోధన
- ●Hyderabad | వైద్యుడి నిర్లక్ష్యంతో పీహెచ్డీ విద్యార్థి మృతి.. హైదరాబాద్ ఆస్పత్రికి రూ. కోటి జరిమానా
- ●BMS | ఈఎస్ఐ వేతన పరిమితిని రూ. 42 వేలకు పెంచండి.. కేంద్రాన్ని కోరిన బీఎంఎస్

CPCB Recruitment | పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండా ఎంపిక

Horoscope | సెప్టెంబర్ 2 రాశిఫలాలు.. ఈ రాశి వారు మాటతీరుతో లాభం పొందుతారు!

Tolichowki SI | రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టోలిచౌకి ఎస్ఐ

Telangana | తెలంగాణలో క్రిటికల్ మినరల్స్‌పై పరిశోధన



