త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ajit Pawar Plane Crash | విజిబులిటీయే విమాన ప్ర‌మాదానికి కార‌ణం : మంత్రి రామ్మోహ‌న్ నాయుడు

Ajit Pawar Plane Crash | మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ విమాన ప్ర‌మాదంలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ప్ర‌మాదంపై పౌర విమానయాన మంత్రిత్వ‌శాఖ వివ‌ర‌ణాత్మ‌క నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఈ నివేదిక చార్టర్డ్ విమానం కూలిపోవడానికి దారి తీసిన సంఘ‌ట‌న గురించి వివ‌రించింది. ప్రాథ‌మిక ద‌ర్యాప్తు ప్ర‌కారం.. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం, విజిబులిటీ త‌క్కువ‌గా ఉండ‌డ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణంగా తెలుస్తోంది.

P

National | Published On Jan 28, 2026, 4.51 pm IST

Ajit Pawar Plane Crash | విజిబులిటీయే విమాన ప్ర‌మాదానికి కార‌ణం : మంత్రి రామ్మోహ‌న్ నాయుడు
Advertisement

Ajit Pawar Plane Crash | మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ విమాన ప్ర‌మాదంలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ప్ర‌మాదంపై పౌర విమానయాన మంత్రిత్వ‌శాఖ వివ‌ర‌ణాత్మ‌క నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఈ నివేదిక చార్టర్డ్ విమానం కూలిపోవడానికి దారి తీసిన సంఘ‌ట‌న గురించి వివ‌రించింది. ప్రాథ‌మిక ద‌ర్యాప్తు ప్ర‌కారం.. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం, విజిబులిటీ త‌క్కువ‌గా ఉండ‌డ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణంగా తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర పౌర విమాన‌యాన‌శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు విచారం వ్య‌క్తం చేశారు. ఉద‌యం 8.48 గంట‌ల ప్రాంతంలో ల్యాండింగ్ స‌మ‌యంలో విజిబులిటీ త‌క్కువ‌గా ఉంద‌ని తెలిపారు. డీజీసీఏ, ఏఏఐబీ బృందాలు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ద‌ర్యాప్తు చేస్తున్నాయ‌ని తెలిపారు. ల్యాండింగ్‌కు ముందు బారామ‌తి ఏటీసీని సంప్ర‌దించిన స‌మ‌యంలో ర‌న్ వే క‌నిపించ‌డం లేద‌ని పైల‌ట్ తెలిపార‌ని.. కొద్దిసేపు విమానం గాలిలోనే చ‌క్క‌ర్లు కొట్టింద‌ని చెప్పారు. ల్యాండింగ్ కోసం రెండోసారి ప్ర‌య‌త్నించార‌ని.. ఈ స‌మ‌యంలోనూ విజిబులిటీ లేద‌ని.. కొంత స‌మ‌యం త‌ర్వాత పైల‌ట్ మ‌ళ్లీ ల్యాండింగ్ ప్ర‌య‌త్నించార‌ని చెప్పారు.

ఆ స‌మ‌యంలో ఏటీసీ ప్ర‌శ్న‌కు పైల‌ట్ స్పందించ‌లేద‌ని.. కొంత స‌మ‌యం త‌ర్వాత ర‌న్ వే స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని పైల‌ట్లు చెప్పార‌న్నారు. ఆ త‌ర్వాత ఏటీసీ ల్యాండింగ్‌కు క్లియ‌రెన్స్ ఇచ్చింద‌ని చెప్పారు. అయితే, ఆ కొద్దిసేప‌టికే విమాన ప్ర‌మాదం జ‌రిగింద‌ని వార్త వ‌చ్చింద‌న్నారు. మొత్తం ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌మాదంపై పౌర విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ నివేదిక విడుద‌ల చేసింది. విమానాశ్ర‌యంలో ఉన్న ఏటీసీ స‌ర్వీస్ ఉద్యోగి వాంగ్మూలం ఆధారంగా నివేదిక సిద్ధం చేసింది. బారామ‌తిలో పూర్తిస్థాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ లేదు. ఇక్క‌డ ఫ్ల‌యిట్ ట్రైనింగ్ సంస్థ‌లు ఎక్కువ‌గా వినియోగించుకుంటాయి. పైల‌ట్లు ట్రాఫిక్ స‌మాచారాన్ని అందిస్తారు.

ప్ర‌మాదానికి ముందు ఏం జ‌రిగింది..?

మంత్రిత్వ‌శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జ‌న‌వ‌రి 28న ఉద‌యం VI-SSK విమానం మొదట ఉదయం 8:18 గంటలకు బారామతి ఏటీసీని సంప్ర‌దించింది. ఆ త‌ర్వాత బారామ‌తికి 30 నాటిక‌ల్ మైల్స్ దూరంలో ఉన్న స‌మ‌యంలో మ‌రోసారి ట‌చ్‌లోకి వ‌చ్చారు. ఆ స‌మయంలో విజిబులిటీ లేక‌పోవ‌డం, ప్ర‌తికూల ప‌రిస్థితుల నేప‌థ్యంలో విక్ష‌ణ‌ను ఉప‌యోగించుకోవాల‌ని పైల‌ట్‌కు ఏటీసీ నుంచి స‌మాచారం అందింది. దాంతో పైల‌ట్ గాలి వేగం, విజిబులిటీ గురించి ఆరా తీశారు. గాలి ఎక్కువ‌గా లేద‌ని.. విజిబులిటీ సుమారు 3వేల మీట‌ర్లుగా ఉన్న‌ట్లు తెలిపారు. ఆ త‌ర్వాత విమానం ల్యాండింగ్‌కు వ‌స్తుండ‌గా.. ర‌న్ వే క‌నిపించ‌డం లేదంటూ పైల‌ట్ విమానాన్ని మ‌ళ్లీ గాల్లోకి తీసుకెళ్లారు.

కొద్దిసేప‌టి త‌ర్వాత మ‌ళ్లీ విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. కొద్ది స‌మ‌యం త‌ర్వాత మ‌రోసారి పైల‌ట్ ర‌న్ వేపై ల్యాండింగ్‌కు ప్ర‌య‌త్నించే క్ర‌మంలో ఏటీసీతో మాట్లాడ‌గా.. ర‌న్ వే క‌నిపిస్తే చెప్పాల‌ని చెప్పాల‌ని సూచించారు. మొద‌ట ప్ర‌స్తుతానికి క‌నిపించ‌డం లేద‌ని చెప్పాడు. క‌నిపిస్తే చెబుతాన‌ని చెప్పాడు. కొన్ని క్ష‌ణాల‌కే ర‌న్ వే క‌నిపిస్తుంద‌ని తెలుప‌గా.. ఉద‌యం 8.43 గంట‌ల‌కు విమానం ర‌న్‌వే11పై దిగేందుకు ఏటీసీ అనుమ‌తి దొరికింది. ఆ త‌ర్వాత కొద్ది నిమిషాల‌కే ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఉప ముఖ్య‌మంత్రి, పైల‌ట్లు స‌హా అందులో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు మంత్రిత్వ‌శాఖ వివ‌రించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement