త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Encounter | జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి!

Encounter | ఉనికి కోసం పోరాడుతున్న మావోయిస్టుల‌కు (Maoists) భారీ ఎదురుదెబ్బ (Encounter) త‌గిలింది. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భ‌మ్ జిల్లా స‌రండా అటవీ (Saranda forest) ప్రాంతంలో మావోయిస్టులు, భ‌ద్ర‌తా ద‌ళాల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి.

G

National | Published On Jan 22, 2026, 12.47 pm IST

Encounter | జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి!
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఉనికి కోసం పోరాడుతున్న మావోయిస్టుల‌కు (Maoists) భారీ ఎదురుదెబ్బ (Encounter) త‌గిలింది. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భ‌మ్ జిల్లా స‌రండా అటవీ (Saranda forest) ప్రాంతంలో మావోయిస్టులు, భ‌ద్ర‌తా ద‌ళాల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో సుమారు 10 మంది మావోయిస్టులు మ‌ర‌ణించారు. మృతుల్లో టాప్ క‌మాండ‌ర్లు కూడా ఉన్నార‌ని తెలుస్తున్న‌ది. హై ప్రొఫైల్ మావోయిస్టులు ఉన్నార‌ని స‌మాచారం అంద‌డంతో స‌రండా అడ‌వుల్లో సీఆర్‌పీఎఫ్ ద‌ళాలు, జార్ఖండ్ పోలీసులకు చెందిన కోబ్రా బ‌ల‌గాలు గాలింపు చేప‌ట్టాయి.

ఈ క్ర‌మంలో భ‌ద్ర‌తా ద‌ళాల‌కు మావోయిస్టులు తార‌స‌ప‌డ‌టంతో.. ఇరు పక్షాల‌కు మ‌ధ్య భీక‌ర ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ క్ర‌మంలో ప‌ది మంది మావోస్టులు మ‌ర‌ణించారు. వారిలో ఆరుగురు మావోయిస్టు క‌మాండ‌ర్లు ఉన్నార‌ని తెలుస్తున్న‌ది. వారిలో ఒక‌రు రూ.50 ల‌క్ష‌ల రివార్డు ఉన్న‌వారు కూడా ఉన్నార‌ని స‌మాచారం.

ఈ ఎన్‌కౌంట‌ర్‌ను జార్ఖండ్ ఐజీ (ఆపరేషన్స్) మిచ‌ల్ రాజ్‌ ధ్రువీకరించారు. అట‌వీ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొన‌సాగుతున్న‌ద‌ని వెల్ల‌డించారు. అద‌న‌పు ద‌ళాల‌ను ఘ‌ట‌నా స్థ‌లానికి పంపించామ‌ని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement