Telangana | 47 మంది మావోలు సరెండర్.. 32 ఆయుధాలు, 515 తూటాలు అప్పగింత
Telangana | తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అగ్ర నేతలతో పాటు వందలాది మంది మావోయిస్టులు అడవిని వీడగా, తాజాగా మరో 47 మంది అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు.
Telangana | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అగ్ర నేతలతో పాటు వందలాది మంది మావోయిస్టులు అడవిని వీడగా, తాజాగా మరో 47 మంది అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. వీరంతా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. 32 తుపాకులతో పాటు 515 తూటాలను అప్పగించారు.
శనివారం లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇంచార్జి హేమ్లా ఇతు అలియాస్ విజ్జా, డివిజనల్ కమిటీ సభ్యుడు, 9వ ప్లాటూన్ కమాండర్ పోడియం లచ్చు అలియాస్ మనోజ్ వంటి ముఖ్య నేతలు ఉన్నారు.
దక్షిణ బస్తర్ డివిసి (DVC) కార్యదర్శితో సహా కీలక నాయకులు, సాయుధ కేడర్లు దాదాపు అందరూ ఈరోజు లొంగిపోవడంతో, ప్రస్తుతం దక్షిణ బస్తర్ డివిసి మొత్తం నిర్వీర్యం అంచుకు చేరిందని డీజీపీ పేర్కొన్నారు.
818 మంది మావోలు లొంగుబాటు
గత రెండేళ్లలో 818 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 334 ఆయుధాలను మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్నాం.
సమర్పించిన ఆయుధాలివే..
ఎల్ఎంజీ - 1
ఏకే 47 రైఫిల్స్ - 4
ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ - 3
ఇన్సాస్ రైఫిల్స్ - 2
410 మస్కెట్ రైఫిల్స్ - 2
8 ఎంఎం రైఫిల్ - 1
సింగిల్ షాట్ గన్స్ - 12
9ఎంఎం పిస్టల్ - 1
రివాల్వర్ - 1
బీజీఎల్ గన్స్ - 2
ఎయిర్ గన్స్ - 2
ఎస్‌బీబీఎల్ గన్ - 1
మరో నలుగురు అజ్ఞాతంలోనే..
తెలంగాణకి చెందిన నలుగురు మావోయిస్టు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ తెలిపారు. వారు కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవాలని అభ్యర్థించారు.
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు వీరే..
1. లక్ష్మణరావు అలియాస్ గణపతి, కేంద్ర కమిటీ సభ్యులు
2. పసునూరి నరహరి అలియాస్ సంతోషం, కేంద్ర కమిటీ సభ్యులు
3. జాడి రత్నా భాయ్ అలియాస్ సుజాత ,స్టేట్ కమిటీ మెంబర్
4. వార్త శేఖర్ అలియాస్ మంగు, స్టేట్ కమిటీ మెంబర్
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



