త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | గ‌ణ‌ప‌తి గారూ లొంగిపోండి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

CM Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్ర‌నేత గ‌ణ‌ప‌తి లొంగిపోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయ‌న ఆరోగ్య భ‌ద్ర‌త‌కు, ర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త తీసుకుంటుంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Apr 28, 2026, 7.27 pm IST

CM Revanth Reddy | గ‌ణ‌ప‌తి గారూ లొంగిపోండి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్ర‌నేత గ‌ణ‌ప‌తి లొంగిపోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయ‌న ఆరోగ్య భ‌ద్ర‌త‌కు, ర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త తీసుకుంటుంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌రేట్‌కు శంకుస్థాప‌న సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు.

సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది వీరులు నేల‌కొరిగారు. భూస్వాములు, జ‌మీందార్లు పెత్త‌నం చ‌లాయిస్తున్న‌ప్పుడు న‌క్స‌ల్బ‌రీ ఉద్య‌మం వ‌చ్చింది. ఉవ్వెత్తున ఎగిసిప‌డ్డ‌ న‌క్స‌ల్బ‌రీ ఉద్య‌మంలో గ‌ద్ద‌ర్ లాంటి వారు బాట ప‌ట్టారు. ఇందిరా గాంధీ అసైన్‌మెంట్ యాక్ట్, అగ్రిక‌ల్చ‌ర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేద‌ల‌కు భూములు అందించారు. దున్నేవాడికి భూమి అందించింది ఇందిరా గాంధీనే. రైతు కూలీల‌కు గిట్టుబాటు ధ‌ర కోసం ఉద్య‌మాలు జ‌రిగితే క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర తీసుకొచ్చింది, రైతుల‌ను ఆదుకున్న‌ది ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ. ఉపాధి హామీ చ‌ట్టాన్ని సోనియా గాంధీ తీసుకొచ్చారు. క‌నీసం మ‌ద్ద‌తు ధ‌ర‌, ఉపాధి హామీ వంటి చ‌ట్టాలు తీసుకొచ్చారని సీఎం తెలిపారు.

అడ‌వి బాట ప‌ట్టిన సోద‌రులంద‌రికీ విజ్ఞ‌ప్తి చేశాం. మీ పోరాటం ఫ‌లించింది.. ప్ర‌జల జీవ‌న ప్ర‌మాణాలు మారిపోయాయి..పెరిగాయి.. మీరు జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌ల‌వాల‌ని కోరాం. ఆదివాసీ, మారుమూల గిరిజ‌న గ్రామాల్లో ఈ ప్ర‌భుత్వం చేయాల‌నుకుంటున్న అభివృద్ధి ఆగిపోతోంది.. ఆదివాసీ బిడ్డ‌ల‌కు విద్య ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని చెప్పాం. జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌ల‌వాల‌ని పిలుపునిచ్చాం. మ‌నం వ‌చ్చిన త‌ర్వాత 814 మంది న‌క్స‌లైట్లు జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిశారు. సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్స్ వ‌చ్చారు. ఒక‌రిద్ద‌రూ మిగిలిపోయారు. వాళ్ల‌కు వ‌య‌సు మీద ప‌డ్డ‌ది. గ‌ణ‌ప‌తి.. వారికి విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. మీ ఆరోగ్యం బాగాలేద‌ని ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చింది.. మెరుగైన వైద్యం అందించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. మీ ప్రాణానికి ర‌క్ష‌ణ క‌ల్పించే బాధ్య‌త ప్ర‌భుత్వం తీసుకుంటుంది. జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసి ప్రజా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించండి.. ప‌రిష్క‌రించేందుకు ప్ర‌జా ప్ర‌భుత్వం ముందుంటుంది. జ‌న‌జీవ‌న స్ర‌వంతిలోకి రండి.. ఆర్థికంగా ఆదుకుంటుంది. గిరిద‌ర్శ‌క్ పేరు మీద‌.. గిరిజ‌న బిడ్డ‌ల‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాం. ఈ గిరిజ‌న బిడ్డ‌ల‌ను రాష్ట్ర అభివృద్ధిలో భాగ‌స్వాముల‌ను చేసిన‌ప్పుడే నిజ‌మైన ప్ర‌జాపాల‌న అందించిన‌ట్టుగా భావిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement