త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asaduddin Owaisi | హిమంత‌ బుర్ర‌లో ట్యూబ్‌లైట్ ఉంది.. అస్సాం సీఎంపై ఒవైసీ ఫైర్‌

Asaduddin Owaisi | ఇది హిందూ దేశ‌మ‌ని, భ‌విష్య‌త్‌లోనూ ప్ర‌ధాన‌మంత్రి ఎప్పుడూ ఒక హిందువుగానే (Hindu PM) ఉంటార‌ని అస్సాం సీఎం హిమంత బిస్వ శ‌ర్మ (Himanta Biswa Sarma) చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

G

National | Published On Jan 11, 2026, 1.26 pm IST

Asaduddin Owaisi | హిమంత‌ బుర్ర‌లో ట్యూబ్‌లైట్ ఉంది.. అస్సాం సీఎంపై ఒవైసీ ఫైర్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఇది హిందూ దేశ‌మ‌ని, భ‌విష్య‌త్‌లోనూ ప్ర‌ధాన‌మంత్రి ఎప్పుడూ ఒక హిందువుగానే (Hindu PM) ఉంటార‌ని అస్సాం సీఎం హిమంత బిస్వ శ‌ర్మ (Himanta Biswa Sarma) చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న బుర్ర‌లో ట్యూబ్‌లైట్ (Tubelight) ఉందంటూ మండిప‌డ్డారు. భార‌త రాజ్యాంగం ఏ ఒక్క వ‌ర్గానికో సొంతం కాద‌ని ధ్వ‌జ‌మెత్తారు. హిమంత పాకిస్థాన్ మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

మ‌హారాష్ట్ర‌లోని ప‌లు న‌గ‌రాల్లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం శోలాపూర్‌లో జ‌రిగిన ప్ర‌చారంలో అస‌దుద్దిన్ మాట్లాడుతూ.. `ఏదో ఒక రోజు హిజాబ్ ధ‌రించిన మ‌హిళ క‌చ్చితంగా భార‌దేశ ప్ర‌ధాన మంత్రి అవుతారు. ఇది నా క‌ల‌` అని వ్యాఖ్యానించారు. దీనిపై హిమంత స్పందిస్తూ.. ఈ దేశంలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. రాజ్యాంగపరంగా ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే, భారతదేశం ఒక హిందూ దేశం. ఇక్కడ ఉన్నది హిందూ నాగరికత. అందుకే భవిష్యత్తులోనూ భారత ప్రధానమంత్రి ఎప్పుడూ ఒక హిందువుగానే ఉంటారని తాము బలంగా నమ్ముతున్నాం. ఈ విషయంలో తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

దీంతో నాగ్‌పూర్‌లో అస‌దుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ హిమంత వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. హిమంత బిస్వ‌ శర్మ బుర్రలో 'ట్యూబ్‌లైట్‌స‌ ఉంది. అత‌డు రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవిని చేపట్టారు. కానీ అందులో ఏముందో అత‌నికి ఏమాత్రం తెలియ‌దు. హిమంత‌ది పాకిస్థాన్ మాదిరి మైండ్‌సెట్‌. ఎందుకంటే పాకిస్థాన్ రాజ్యాంగంలో ఒకే మ‌తానికి చెందిన చెందిన వారికి మాత్ర‌మే దేశ‌ ప్ర‌ధాని లేదా అధ్య‌క్ష ప‌ద‌వులు ప‌రిమితం. కానీ, మ‌న‌ రాజ్యాంగం అలా కాదు. బాబా సాహెబ్ అంబేద్క‌ర్ మ‌న‌కు రాజ్యాంగాన్ని ఇచ్చారు. హిమంత బిస్వా శర్మ కంటే అంబేడ్కర్ ఎంతో విజ్ఞానవంతుడు. ఆయన రాసిన రాజ్యాంగం దేవుడిని నమ్మని నాస్తికులకు కూడా సమాన హక్కులు కల్పిస్తుంది. అదే భార‌త దేశ రాజ్యాంగ గొప్ప‌ద‌నం. భార‌త్ ఏ ఒక్క వర్గానికో సొంతం కాదు. కానీ హిమంత మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా సంకుచిత మనస్తత్వం తో వ్యవహరిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement