త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | రాజ్యాంగం ర‌ద్దుకు బీజేపీ కుట్ర‌: రాహుల్‌గాంధీ

Rahul Gandhi | దేశంలో రాజ్యాంగం (Constitution) ర‌ద్దు చేసేందుకు పాల‌క‌ బీజేపీ (BJP) కుట్రలు చేస్తోంద‌ని లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత (Leader of Opposition) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.

A

National | Published On Dec 23, 2025, 3.32 pm IST

Rahul Gandhi | రాజ్యాంగం ర‌ద్దుకు బీజేపీ కుట్ర‌: రాహుల్‌గాంధీ
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర.న్యూస్‌: దేశంలో రాజ్యాంగం (Constitution) ర‌ద్దు చేసేందుకు పాల‌క‌ బీజేపీ (BJP) కుట్రలు చేస్తోంద‌ని లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత (Leader of Opposition) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. అంద‌రికీ స‌మాన హ‌క్కులు క‌ల్పించే భార‌త రాజ్యాంగాన్ని ర‌ద్దు చేయ‌డ‌మే బీజేపీ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని అన్నారు. జ‌ర్మ‌నీలోని బెర్లిన్‌లో ఉన్న హెర్టీ స్కూల్‌లో విద్యార్థుల‌తో స‌మావేశ‌మైన రాహుల్‌గాంధీ మాట్లాడుతూ రాష్ట్రాల మ‌ధ్య‌, భాష‌ల మ‌ధ్య‌, మ‌తాల మ‌ధ్య ఉన్న స‌మాన‌త్వ భావ‌న‌ను దెబ్బ‌తీస్తూ, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల‌ను బీజేపీ మంట‌గలుపుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

ప్ర‌పంచంలో భార‌తదేశం అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌ని రాహుల్ అన్నారు. దేశంలో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌పై జ‌రుగుతున్న ఏ దాడి అయినా, దానిని అంత‌ర్జాతీయ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌పై జ‌రిగే దాడిగానే ప‌రిగ‌ణించాల‌న్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను త‌మ గుప్పిట్లోకి తీసుకుని, రాజ‌కీయంగా వినియోగించుకుంటోంద‌ని మండిప‌డ్డారు. ఈడీ, సీబీఐ వంటి వాటిని వినియోగించుకుని ప్ర‌తిప‌క్షాల‌పై రాజ‌కీయ కేసుల‌ను న‌మోదు చేస్తోంద‌ని ఆరోపించారు.

ప్ర‌స్తుతం దేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అనుస‌రిస్తున్న ఆర్థిక విధానం పూర్తిగా నిలిచిపోయింద‌ని రాహుల్ ఆరోపించారు. దేశంలోని సంస్థాగ‌త వ్య‌వ‌స్థ‌పై జ‌రుగుతున్న ఈ దాడిని ఎదుర్కొనేందుకు ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌మైన ప్ర‌తిఘ‌ట‌న వ్య‌వ‌స్థ‌ను రూపొందిస్తున్నాయ‌ని చెప్పారు. ఇండియా కూట‌మి పార్టీల మ‌ధ్య వ్యూహాత్మ‌క విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ, రాజ్యాంగాన్ని ర‌క్షించ‌డంలో తామంతా ఐక్యంగానే ఉంటామ‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement