త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maoists | మావోయిస్టుల‌కు మ‌రో భారీ ఎదురు దెబ్బ‌.. కీల‌క నేత హ‌తం

Maoists | త్రినేత్ర‌.న్యూస్ : ఇప్ప‌టికే వ‌రుస ఎదురు దెబ్బ‌లు తింటున్న మావోయిస్టు పార్టీ (Maoist Party) కి మ‌రో భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ (Chhattisgarh) బీజాపూర్ (Bijapur) జిల్లాలో ఎదురుకాల్పుల ఘ‌ట‌న‌ (Encounter) లో మావోయిస్టు (Maoists) పార్టీ అగ్ర‌నేత పాపారావు (Papa Rao) అలియాస్ మంగు మృతిచెందారు.

A

National | Published On Jan 17, 2026, 4.07 pm IST

Maoists | మావోయిస్టుల‌కు మ‌రో భారీ ఎదురు దెబ్బ‌.. కీల‌క నేత హ‌తం
Advertisement

Maoists | త్రినేత్ర‌.న్యూస్ : ఇప్ప‌టికే వ‌రుస ఎదురు దెబ్బ‌లు తింటున్న మావోయిస్టు పార్టీ (Maoist Party) కి మ‌రో భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ (Chhattisgarh) బీజాపూర్ (Bijapur) జిల్లాలో శనివారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల ఘ‌ట‌న‌ (Encounter) లో మావోయిస్టు (Maoists) పార్టీ అగ్ర‌నేత పాపారావు (Papa Rao) అలియాస్ చంద్ర‌య్య అలియాస్ మంగు మృతిచెందారు. భ‌ద్ర‌తాబ‌ల‌గాలతో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఆయ‌న‌తో పాటు మ‌రొక‌రు మ‌ర‌ణించారు. ఘ‌ట‌నా స్థ‌లం నుంచి పోలీసులు రెండు ఏకే 47 తుపాకుల‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రిత‌మే బీజాపూర్ జిల్లాలోనే 52 మంది మావోయిస్టులు లొంగిపోయిన ఘ‌ట‌న మ‌రిచిపోక‌ముందే ఈ ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

పాపారావుపై రూ. కోటి రివార్డు..

సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని నిమ్మ‌ల‌గూడెం గ్రామానికి చెందిన సున్నం చంద్ర‌య్య (56) గ‌త మూడు ద‌శాబ్దాలుగా మావోయిస్టు ఉద్య‌మంలో క్రియాశీల‌కంగా ప‌నిచేశారు. దండ‌కార‌ణ్య స్పెష‌ల్ జోన‌ల్ క‌మిటీ స‌భ్యుడిగా, ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ కార్య‌ద‌ర్శిగా కీల‌క బాధ్య‌త‌లు ఆయ‌న నిర్వ‌ర్తిస్తున్నారు. దక్షిణ బస్తర్‌ వ్యూహకర్తగా పార్టీ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న పాత్ర ఎంతో గొప్ప‌ది. బ‌స్త‌ర్ ప్రాంతంలో మిగిలి ఉన్న అగ్ర‌నేత‌ల్లో ఆయ‌నను అత్యంత కీల‌క‌నేత‌గా గుర్తించిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఆయ‌న‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిపి రూ.కోటి రివార్డును ప్ర‌క‌టించారు.

ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు..

పాపారావును అంత‌మొందించేందుకు ఆప‌రేష‌న్‌ను ముమ్మ‌రం చేసిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎట్ట‌కేల‌కు ఆయ‌న‌ను మ‌ట్టుబెట్టాయి. త‌న ఫొటో కూడా భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు చిక్క‌కుండా పాపారావు అత్యంత జాగ‌రూక‌త‌తో వ్య‌వ‌హ‌రించేవారు. ఇప్ప‌టికీ పోలీసులు వ‌ద్ద ఉన్న ఆయ‌న ఫొటో ఎప్ప‌టిదోన‌ని వారే చెబుతుంటారు. అటువంటి ఆయ‌న‌ను ప‌ట్టుకునేందుకు మార్చి నెల‌ను గ‌డువుగా విధించుకున్న భ‌ద్ర‌తా బ‌ల‌గాలు రెండు నెల‌లకు ముందుగానే త‌మ ఆప‌రేష‌న్‌లో విజ‌యం సాధించాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement