DGP Shivdhar Reddy | తెలంగాణలో మావోయిస్టులు లేరు : డీజీపీ శివధర్ రెడ్డి
DGP Shivdhar Reddy | తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 42 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం లొంగిపోయారు. భారీగా ఆయుధాలను అప్పగించారు.
ఇప్పటి వరకు 205 మంది మావోలు లొంగుబాటు
ఇక మిగిలింది ఐదుగురే
వారు కూడా లొంగిపోవాలని కోరుతున్నాం
DGP Shivdhar Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 42 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం లొంగిపోయారు. భారీగా ఆయుధాలను అప్పగించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణలో మావోయిస్టులు లేరని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ఇక మిగిలింది ఐదుగురు మావోయిస్టులే అని ఆయన తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న ఆ ఐదుగురిని కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరుతున్నామని డీజీపీ పేర్కొన్నారు.
శుక్రవారం లొంగిపోయిన 42 మంది మావోయిస్టుల్లో టాప్ కమాండర్లు ఉన్నారు. పీఎల్‌జీఏ బెటాలియన్ కమాండర్, డీకేఎస్‌జడ్‌సీ మెంబర్ సోది మల్లా అలియాస్ కేశల్ అలియాస్ నిఖిల్, స్టేట్ కమిటీ మెంబర్, జేఎంఎండబ్ల్యూపీ డీవీసీ సెక్రటరీ చాప నారాయణ అలియాస్ గజేందర్ అలియాస్ మధు, బీకే ఏఎస్ఆర్ డివిజన్ డీవీసీ మెంబర్ కడ్తి సన్ను అలియాస్ మంగ్తు ఉన్నారు. 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 205 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులు 36 ఆయుధాలను అప్పగించారు. ఇందులో ఏకే 47 రైఫిల్స్, ఎస్ఎల్ఆర్‌లు, ఇన్సాస్ రైఫిల్స్, .303 రైఫిల్స్, 9ఎంఎం స్టెన్ గన్, పిస్తోల్స్, రివాల్వర్లతో పాటు ఇతర ఆయుధాలు, 1007 రౌండ్ల బుల్లెట్లను అప్పగించారు. 800 గ్రాముల బంగారం కూడా అప్పగించినట్లు డీజీపీ తెలిపారు.
పీఎల్‌జీఏకు చెందిన తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులందరూ లొంగిపోవడంతో రాష్ట్రంలో మావోయిస్టు నెట్ వర్క్ పూర్తిగా మాయమైందని డీజీపీ పేర్కొన్నారు. ఇక గణపతి, పసునూరి నరహరి, జోడే రత్నభాయి, వార్త శేఖర్ అలియాస్ మంక్తు, రంగబోయిన రూపీ అలియాస్ భాగ్య ఉన్నారు. ఈ ఐదుగురు కూడా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు లొంగిపోవాలి. ఎవరైతే బయటకు రాకుండా ఉన్నారో వారు అజ్ఞాతం వీడి రావాలని ఆహ్వానిస్తున్నామని డీజీపీ పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



