Encounter | కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
Encounter | తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) కొనసాగుతున్నాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు (Maoists) మరణించారు.
Encounter | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) కొనసాగుతున్నాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు (Maoists) మరణించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కార్యదర్శి దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో కేజీహెచ్-2 పేరుతో సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉండవచ్చని భావిస్తున్నారు.
కాగా, మావోయిస్టులు మధ్యప్రదేశ్ నుంచి కర్రెగుట్టల్లోకి ప్రవేశించారంటూ నిఘా వర్గాల సమాచారం మేరకు ఆ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, డీఆర్జీ బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. సుమారు 5 వేల మంది బలగాలతో అటవీ ప్రాంతాన్ని మంగళవారం సాయంత్రం నుంచి జల్లడపడుతున్నారు.
మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకత్వంలో ఇప్పటికే చాలా మంది మృతిచెందారు. నలుగురు మాత్రమే మిగిలారు. కాగా, తెలంగాణకు చెందిన 15మంది మావోయిస్టులు అజ్ఞాతంలో గడుపుతున్నారు. వారిలో రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, మావోయిస్టు కీలక నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, ముప్పిడి సాంబయ్య, వార్త శేఖర్, జోడే రత్నభాయి, బడే చొక్కారావు ఉన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



