త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganapathi | అమిత్ షా సమ‌క్షంలో లొంగిపోనున్న మావోయిస్టు అగ్ర‌నేత‌ గ‌ణ‌ప‌తి..!

Ganapathi | మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియ‌ర్ నేత ముప్పాళ్ల లక్ష్మణరావు (Muppala Lakshmana Rao) అలియాస్ గణపతి (Ganapathi) కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) స‌మ‌క్షంలో లొంగిపోనున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఇటీవ‌ల సీఎం రేవంత్ స‌మ‌క్షంలో 140 మంది మావోయిస్టులు హైద‌రాబాద్‌లో లొంగిపోయిన విష‌యం తెలిసిందే.

G

Telangana | Published On Mar 11, 2026, 12.04 pm IST

Ganapathi | అమిత్ షా సమ‌క్షంలో లొంగిపోనున్న మావోయిస్టు అగ్ర‌నేత‌ గ‌ణ‌ప‌తి..!
Advertisement

Ganapathi | త్రినేత్ర‌.న్యూస్‌: మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియ‌ర్ నేత ముప్పాళ్ల లక్ష్మణరావు (Muppala Lakshmana Rao) అలియాస్ గణపతి (Ganapathi) కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) స‌మ‌క్షంలో లొంగిపోనున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఇటీవ‌ల సీఎం రేవంత్ స‌మ‌క్షంలో 140 మంది మావోయిస్టులు హైద‌రాబాద్‌లో లొంగిపోయిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా గ‌ణ‌ప‌తి లొంగిపోవాలంటూ ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలానికి చెందిన గణపతి.. మావోయిస్టు పార్టీకి సుదీర్ఘకాలం పాటు చీఫ్ గా వ్యవహరించారు. 2018లో అనారోగ్య కార‌ణాల‌తో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయన వైదొలిగారు. అయితే తాజాగా ఆయ‌న నేపాల్ నుంచి ఢిల్లీ చేరుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల నేపథ్యంలో గణపతి తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన త్వరలోనే లొంగిపోవడానికి సిద్దంగా ఉన్న‌ట్లు గ‌తంలోనే ప్ర‌చారం జ‌రిగింది.

వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణపతి సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు సైతం కోరుతున్నట్లు సమాచారం. కాగా ఆపరేషన్‌ కగార్‌ తరువాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిన గణపతి దేశం విడిచి నేపాల్‌ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా తెలంగాణ పోలీసులతో టచ్‌లోకి వచ్చారని.. ఉన్నతాధికారులు ఆయనకు సేఫ్‌ ప్యాసేజ్‌ కల్పించి నేపాల్‌ నుంచి ఢిల్లీకి వచ్చేలా చూశారని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలుస్తోంది.

అనారోగ్యంతోనే బాధ్యతల నుంచి పక్కకు..

మావోయిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న గణపతి అనారోగ్య కారణాల వల్ల మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. అయినా జనజీవన స్రవంతిలోకి రాకుండా ఉద్యమంలో కొనసాగారు. మూడు నాలుగు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్‌ను ఆ తర్వాత మావోయిస్టు పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, సాయుధ పంథావైపు నడిపించడంలో గణపతి కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో పోలీసులకు పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. ఏది ఏమైనా గణపతి లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం ముగింపునకు వచ్చినట్టేనని అంటున్నారు.

సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్‌గా..

గణపతి 1949లో జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం బీర్పూర్‌లో జని్మంచారు. ఆయన్ను ఉద్యమంలో టీచర్‌ అని పిలుస్తారు. 1970లో జరిగిన రైతు పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర తర్వాత నక్సల్‌ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్‌గా గణపతికి గుర్తింపు లభించింది. మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఆయన పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్‌వర్క్‌ విస్తరణలో గణపతిది కీలక పాత్రగా చెబుతారు. గణపతితో పాటు ఆయన సహచరిణి సుజాత కూడా ఇప్పటివరకు అజ్ఞాతంలోనే ఉన్నారు.

 

Advertisement
Advertisement