త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jacqueline Fernandez | నేను నిర్దోషినే.. విచార‌ణ ఎదుర్కొంటా.. కోర్టులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వాదనలు

Jacqueline Fernandez | రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బుధవారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఎదుట హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తనపై మోపిన అన్ని అభియోగాలు, ఆరోపణలను ఖండించింది.

P

Entertainment | Published On Jun 3, 2026, 5.28 pm IST

Jacqueline Fernandez | నేను నిర్దోషినే.. విచార‌ణ ఎదుర్కొంటా.. కోర్టులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వాదనలు
Advertisement

Jacqueline Fernandez | రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బుధవారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఎదుట హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తనపై మోపిన అన్ని అభియోగాలు, ఆరోపణలను ఖండించింది. పీఎంఎల్ఏ కింద కోర్టు అధికారికంగా అభియోగాలు నమోదు చేసిన అనంతరం జాక్వెలిన్ “నేను ట్రయల్‌ను ఎదుర్కొంటాను” అని పేర్కొంది. విచారణలో తాను నిర్దోషినని నిరూపించుకుంటానని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌తో పాటు అతని భార్య లీనా మారియా పాల్ సహా మరికొందరిపై కూడా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.

ఈడీ (Enforcement Directorate) దర్యాప్తు ప్రకారం.. సుఖేష్ జైలులో ఉండగానే ఒక క్రిమినల్ నెట్‌వర్క్‌ను నడిపి స్పూఫ్ కాల్స్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. జైలులో ఉన్న వారి కుటుంబ సభ్యులకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సొమ్మును షెల్ కంపెనీలు, హవాలా మార్గాల ద్వారా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ర్యాన్‌బాక్సీ మాజీ యజమాని శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్‌ను కూడా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు నేపథ్యంలో జాక్వెలిన్‌కు చెందిన రూ.7.2 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది.

దర్యాప్తు సంస్థల ప్రకారం.. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఖరీదైన బహుమతులు జాక్వెలిన్‌కు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో పర్షియన్ పిల్లులు, లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు, ఖరీదైన ఆభరణాలు ఉన్నట్లు ఈడీ ఆరోపించింది. సుఖేష్ చంద్రశేఖర్‌ను పలువురు బాలీవుడ్ ప్రముఖులకు పరిచయం చేసిన పింకీ ఇరానీ కూడా ఈ కేసులో నిందితురాలిగా ఉన్నారు. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) దాఖలు చేసిన చార్జిషీట్‌లో మొత్తం 14 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. హవాలా, షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా డబ్బును సంపాదించినట్లు ఆరోపణలు ఉండగా, ఈ కేసు ఇప్పటికే ట్రయల్ దశకు చేరుకుంది.

Advertisement
Advertisement