Money Laundering Case | అప్రూవర్‌గా మారేందుకు సిద్ధం.. కోర్టులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్
Money Laundering Case | ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన విచారణలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది. అవసరమైతే అప్రూవర్‌గా మారేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కోర్టుకు వెల్లడించింది.
Entertainment | Published On Apr 17, 2026, 5.12 pm IST
Money Laundering Case | ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన విచారణలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది. అవసరమైతే అప్రూవర్‌గా మారేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కోర్టుకు వెల్లడించింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ ఆమె అప్రూవర్‌గా మారాలంటే నేరుగా ఈడీకి అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని ఉంటుందని స్పష్టం చేసింది. ఆమె ఇచ్చే ప్రకటనలు, దర్యాప్తుకు అందించే సహకారం ఆధారంగా అప్రూవర్ హోదా ఇవ్వాలా వద్దా అనేది ఈడీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఈ అంశంపై ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు.. కేసు విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా జాక్వెలిన్‌కు విదేశీ పర్యటనకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 24 నుంచి మే 25 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఉన్నప్పటికీ.. కోర్టు విధించిన కొన్ని షరతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసు మొత్తం రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌కు కేసు సంబంధించింది. ఇందులో ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జైలులో ఉన్నప్పటికీ భారీ మోసాలు, వసూళ్ల కోసం నెట్‌వర్క్‌ని నడిపినట్లుగా ఆరోపణలున్నాయి. అనేక మంది నుంచి కోట్లాది రూపాయల సొత్తును దోచుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో బాలీవుడ్‌తో సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఈ క్రమంలోనే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈడీ దర్యాప్తు ప్రకారం.. సుకేష్ జాక్వెలిన్‌కు ఖరీదైన గడియారాలు, బ్యాగులు, నగలు తదితర విలువైన బహుమతులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇవన్నీ అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసినవేనని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నది. అయితే, జాక్వెలిన్ మాత్రం సుకేశ్ చంద్రశేఖర్ అసలు వ్యక్తిత్వం, అతని నేరాల గురించి తెలియనది స్పష్టం చేసింది. తనను ఓ వ్యాపారవేత్తగా పరిచయం చేసుకొని తనను మోసం చేశాడని కోర్టుకు తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tihar Jail | తీహార్ జైల్లో పెట్టే ఆహారం తినలేకపోతున్నా.. వంట చేసుకునేందుకు అనుమతివ్వండి.. కోర్టును ఆశ్రయించిన ఖైదీ
జులై 10, 2026

Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!
జులై 10, 2026

Wimbledon | వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ చాంపియన్స్‌గా ఒస్టాపెంకో–అరెవాలో జోడీ
జులై 10, 2026
తాజావార్తలు
- ●E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం
- ●Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..
- ●Sreeleela | సోషల్ మీడియాలో శ్రీలీల రేంజ్ మామూలుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు ఎంత డిమాండ్ చేస్తుందంటే?
- ●Sridhar Babu | తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేలా చూడండి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు లాభం..

E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం

Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల

WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..

Sreeleela | సోషల్ మీడియాలో శ్రీలీల రేంజ్ మామూలుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు ఎంత డిమాండ్ చేస్తుందంటే?



