Ajit Pawar | అజిత్ పవార్ ఎవరు..? సహకార సంఘం అధ్యక్షుడి నుంచి డిప్యూటీ సీఎం వరకు రాజకీయ ప్రస్థానం..!
Ajit Pawar | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబయి నుంచి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో మహారాష్ట్రలో విషాదాన్ని నింపింది.
Ajit Pawar | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబయి నుంచి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో మహారాష్ట్రలో విషాదాన్ని నింపింది.
అజిత్ అనంతరావు పవార్ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో జూలై 22, 1959న జన్మించారు. ఆయన ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్నయ్య అనంతరావు పవార్ కుమారుడు. ఆయన తండ్రి వీ శాంతారామ్ రాజకమల్ స్టూడియోలో పనిచేశారు. అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో నడిచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజలు, మద్దతుదారులు ఆయనను దాదాగా పిలుచుకుంటారు. ఆయన ప్రాథమిక విద్యను దేవోలి ప్రవరాలో, మాధ్యమిక విద్యను మహారాష్ట్ర విద్యా బోర్డు నుంచి పూర్తి చేశారు.
రాజకీయ ప్రస్తానం..
అజిత్ పవార్ తన రాజకీయ జీవితాన్ని 1982లో ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన వసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఆయన తొలుత ఒక చక్కెర సహకార సంఘం ఎన్నికల్లో పోటీ చేశారు. 1991లో పూణే జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన 16 సంవత్సరాలు కొనసాగారు. 1991లో బారామతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కానీ, తన బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ స్థానాన్ని వదులుకున్నారు. అదే సంవత్సరం మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1992-1993 మధ్య వ్యవసాయ-విద్యుత్ శాఖల రాష్ట్ర మంత్రిగా పని చేశారు. 1995, 1999, 2004, 2009, 2014లో బారామతి నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు. వ్యవసాయం, విద్యుత్, జలవనరుల తదితర కీలక మంత్రి పదవులను నిర్వహించారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా పేర్కొంటారు. 2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన డిప్యూటీ సీఎం పదవిని ఆకాంక్షించారు. కానీ, ఆ పదవి ఛగన్ భుజ్‌బల్‌కు దప్పింది. అయితే, డిసెంబర్ 2010లో తొలిసారిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2013లో నీటిపారుదల కుంభకోణంలో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. దాంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ కేసులో నిర్దోషిగా తేలడంతో తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టారు.
బాబాయ్‌తోనే వివాదం..
అజిత్ పవార్ తన రాజకీయ జీవితంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. 2013లో డ్యామ్‌లో నీళ్లు లేకపోతే మూత్రంతో నింపాలా? అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారాన్ని రేపాయి. తీవ్ర విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్లు బెదిరింపులకు గురి చేశారంటూ ఆరోపణలున్నాయి, అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా వార్తలు వచ్చాయి. లవాసా లేక్ సిటీ ప్రాజెక్టుకు సహాయం చేశారనే ఆరోపణలతో పాటు ఇంకా పలు విషయాల్లో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. ఎన్ని వివాదాలు ఉన్నా ఆయన మహారాష్ట్ర రాజకీయాలు, ఎన్‌సీపీలో అత్యంత ప్రభావంతమైన నాయకుల్లో ఒకరిగా పేర్కొంటారు. అజిత్ పవార్ బలమైన పరిపాలనా అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఆయన బాబాయ్ శరద్ పవార్‌తో రాజకీయ విభేదాలు వచ్చినా.. ఆయన తాను మాత్రం పవార్‌కు అనుచరుడిగా చెప్పుకున్నారు. అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయ రంగంలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరు. ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన క్రియాశీలపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మరణం అందరినీ షాక్‌కు గురి చేసింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






