Airline ops hit | నావిటైర్‌లో సమస్య.. దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం
Airline ops hit | దేశంలో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది (Airline ops hit). ఎయిర్‌లైన్స్ బుకింగ్, చెక్‌ఇన్ కోసం ఉపయోగించే కంట్రోల్ సిస్టమ్ అయిన నావిటైర్ (Navitaire)లో సాంకేతిక సమస్య తలెత్తింది.
Airline ops hit | దేశంలో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది (Airline ops hit). ఎయిర్‌లైన్స్ బుకింగ్, చెక్‌ఇన్ కోసం ఉపయోగించే కంట్రోల్ సిస్టమ్ అయిన నావిటైర్ (Navitaire)లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై సహా దేశవ్యాప్తంగా ఉన్న పలు విమానాశ్రయాల్లో విమాన కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గురువారం ఉదయం 6:30 గంటల తర్వాత సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు (Navitaire outage in India). దాదాపు గంటపాటూ ఈ సమస్య కొనసాగింది. అప్రమత్తమైన అధికారులు సమస్యను గంటలోపే పరిష్కరించారు. అయితే, సమస్య తలెత్తిన సమయంలో బుకింగ్, చెక్ఇన్‌లను మాన్యువల్‌గా నిర్వహించాల్సి వచ్చింది. ఫలితంగా ఎయిర్‌పోర్టుల్లో రద్దీ పెరిగింది. ఈ సమస్య కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ సమస్యపై ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టు ఎక్స్‌లో స్పందించింది. సిస్టమ్ అంతరాయం కారణంగా ఇండిగో (IndiGo), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express), ఆకాశా ఎయిర్ (Akasa Air), స్పైస్‌జెట్ (SpiceJet) విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు తెలిపింది. ఉదయం 6:45 నుంచి 7:28 వరకూ తిరిగి 8:10 నుంచి 8:25 వరకూ ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొంది. ఫలితంగా విమానాశ్రయంలో చెక్ఇన్, బోర్డింగ్ ప్రక్రియల్లో తాత్కాలిక జాప్యానికి దారితీసినట్లు వెల్లడించింది.
అమేడియస్ (Amadeus) యాజమాన్యంలోని నావిటైర్ (Navitaire).. ప్రపంచవ్యాప్తంగా పలు విమానయాన సంస్థలకు రిజర్వేషన్, చెక్ఇన్, డిపార్చర్ కంట్రోల్ సిస్టమ్‌లను అందిస్తోంది. అది విఫలమైతే.. ప్యాసింజర్ వివరాలను ప్రాసెస్ చేయడంలో అంతరాయం ఏర్పడుతుంది. ఇది జాప్యాలు, రద్దీకి దారితీస్తుంది. కాగా, గతేడాది ఢిల్లీలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా విమాన కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Noida Airport | నోయిడా నుంచి తొలి విమానం నవీ ముంబయికే..! ఈ నెల 10 నుంచి టికెట్ల బుకింగ్..!
మే 6, 2026

Aviation Turbine Fuel | పెరిగిన ఇంధన భారం: మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే విమానాలు బందే.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ సంస్థల విజ్ఞప్తి
ఏప్రిల్ 28, 2026

IndiGo Plane Hit By Car | ఇండిగో విమానాన్ని ఢీ కొట్టిన కారు
ఏప్రిల్ 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



