Air India Express | విమానం గాల్లో ఉండగా పొగలు.. లక్నోలో ఎమర్జెన్సీ లాండింగ్..!
Air India Express | ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం గాల్లో ఉండగానే పొగలు రావడంతో ఆ విమానాన్ని లక్నోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పరిస్థితి అత్యవసరంగా ఉండడంతో పైలట్ ‘పాన్-పాన్’ కాల్ ఇచ్చి సమాచారాన్ని తెలియజేశారు.
Air India Express | ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం గాల్లో ఉండగానే పొగలు రావడంతో ఆ విమానాన్ని లక్నోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పరిస్థితి అత్యవసరంగా ఉండడంతో పైలట్ ‘పాన్-పాన్’ కాల్ ఇచ్చి సమాచారాన్ని తెలియజేశారు. సోమవారం సాయంత్రం బాగ్‌డోగ్రా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానంలో ప్రయాణ మధ్యలో ఉన్న సమయంలో పొగలు రావడాన్ని గమనించారు. దీంతో విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.
విమానంలోని అవియానిక్స్ బేలో పొగ కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితిని సూచించేందుకు పైలట్ ‘మేడే’ కాల్‌కు బదులుగా ‘పాన్-పాన్’ కాల్ ఇచ్చారు. ఈ సమయంలో 148 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. లక్నోలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్త చర్యగా విమానాన్ని మళ్లించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులకు అల్పాహారం అందించి, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ విమానాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై స్పందించిన సంస్థ ప్రతినిధి, నిబంధనల ప్రకారం భద్రతా చర్యలు తీసుకుని విమానాన్ని మళ్లించామని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కూడా చెప్పారు. లక్నోలో దిగిన తర్వాత విమానాన్ని ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్’ (AOG)గా ప్రకటించారు. అంటే విమానం పూర్తిస్థాయి సాంకేతిక తనిఖీలు, అవసరమైన మరమ్మతుల లక్నో విమానాశ్రయంలోనే ఉంచారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nayanthara | టాక్సిక్ కోసం ఇంగ్లీష్‌లో డబ్బింగ్ - నయన్ రూటే సఫరేటు
- ●Harish Rao | బిడ్డా అఖిలా.. నేనున్నా.. నువ్ డాక్టర్ అవ్వు
- ●KTR | వర్షాలు బాగా పడాలే.. రాష్ట్రం పచ్చగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా
- ●Bhatti Vikramarka | తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం: భట్టి విక్రమార్క
- ●RS Praveen Kumar | ‘మహా’ ఓనర్ వంశీని ప్రశ్నించే దమ్ము లేదా? పోలీసులకు ఆదేశాలు ఎవరిస్తున్నరు?
- ●Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Nayanthara | టాక్సిక్ కోసం ఇంగ్లీష్‌లో డబ్బింగ్ - నయన్ రూటే సఫరేటు

Harish Rao | బిడ్డా అఖిలా.. నేనున్నా.. నువ్ డాక్టర్ అవ్వు

KTR | వర్షాలు బాగా పడాలే.. రాష్ట్రం పచ్చగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా

Bhatti Vikramarka | తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం: భట్టి విక్రమార్క






