Hyderabad | నకిలీ నెంబర్ ప్లేట్లు వాడితే.. జైల్లో ఊచలు లెక్కపెడతారు..
Hyderabad | ఆర్టీఏ నియమాలు పాటించకుండా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : ఆర్టీఏ నియమాలు పాటించకుండా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.
కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో షేక్ అబ్బు బాబా(41) షేక్ రిహాన్(19) అనే ఇద్దరు వ్యక్తులు తమ వాహనాలకు నంబర్ ప్లేట్లు మార్చి డ్రైవింగ్ చేస్తున్నారు. వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఇరువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
షేక్ రిహాన్ తన హీరో గ్లామర్ బైక్ అసలు నంబర్ TS08FB2768కు బదులుగా TS08FE2768 (హోండా యాక్టివా) గా మార్చాడు. దీంతో హోండా యాక్టివా యజమాని అయిన కూకట్‌పల్లి నివాసి ఎ లక్ష్మీ పేరిట చలాన్లు జారీ అయ్యాయి. ఆమె ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడనప్పటికీ చలాన్లు జారీ కావడంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, షేర్ రిహాన్ వ్యవహారం బయటపడింది. మొత్తానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి షేక్ రిహాన్‌ను అరెస్టు చేశారు.
బాధితులు ఫిర్యాదు ఇలా చేయొచ్చు..
పౌరులు ఎవరైనా తమ వాహన నంబర్ ప్లేట్ దుర్వినియోగానికి గురవుతున్నట్లు అనుమానిస్తే వెంటనే కింది మార్గాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు:
వెబ్‌సైట్: https://echallan.tspolice.gov.in
ఈమెయిల్: echallanhelpdesk.hyd@gmail.com
వాట్సాప్ నంబర్: 8712661690
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





