Abhijeet Dipke | పోలీసుల నిర్బంధంలో అభిజీత్ దీప్కే.. విమానంలోనే అదుపులోకి..
Abhijeet Dipke | ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ (Jantar Mantar) వద్ద భారీ నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చింది. నిరసనలో పాల్గొనేందుకు ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను (Abhijeet Dipke) పోలీసులు నిర్బంధించారు.
Abhijeet Dipke | త్రినేత్ర న్యూస్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ (Jantar Mantar) వద్ద భారీ నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చింది. నిరసనలో పాల్గొనేందుకు ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను (Abhijeet Dipke) పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీ విమానాశ్రాయనికి చేరుకున్న ఆయనను విమానం నుంచి అందుపులోకి తీసుకున్నారు.
శనివారం ఉదయం సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్ (Saurav Das), అశుతోష్ రాంకా (Ashutosh Ranka,)తో కలిసి ముంబై నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఈ క్రమంలో విమానం ఢిల్లీ చేరుకోగా.. ప్రయాణికులు అందులోనుంచి దిగక ముందే ఢిల్లీ పోలీసులు లోపలికి ప్రవేశించారు. అభిజీత్‌తోపాటు సౌరవ్ దాస్, అశుతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తాము దిగకముందే పెద్ద సంఖ్యలో ఢిల్లీ పోలీసులు విమానాన్ని చుట్టుముట్టారని వీడియోలో తెలిపారు. తాము శాంతి యుతంగా నిరసనకు పిలుపునిస్తే.. విమానంలోనే తమను అరెస్టు చేశారని పేర్కొన్నారు. 30 ఏండ్ల వయసున్న యువకులను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని చెప్పారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని గుర్తుచేసేలా మోదీ ప్రవర్తిస్తున్నారని చెప్పారు. తాము బయటకు వచ్చే వరకు మీరు వేచి ఉండాల్సింది. వచ్చి మమల్ని అరెస్టు చేసుకోండి. మేమేం భయపడటం లేదు.. అని విమానం ఎక్కిన మహిళా పోలీసులతో దీప్కే అన్నారు. తమ తోటి ప్రయాణికులను కూడా పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు.
Abhijeet Dipke DETAINED!
Saurav Das DETAINED!
Ashutosh Ranka DETAINED!To save his traitor friend, the dictator has declared war against his own citizens! https://t.co/cUGrdetlx2
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) October 10, 2026
#WATCH | Delhi Police personnel enter the aircraft that was carrying Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke to Delhi. The flight landed at IGI Airport a few minutes ago.
"...I have come here to be arrested; arrest me," Abhijeet Dipke tells Delhi Police
"No, this is not an arrest. Please cooperate," Delhi Police personnel tell him.
— ANI (@ANI) October 10, 2026
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని శనివారం ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ నిరసనల్లో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్న ఆయనను నిర్బంధించారు. శుక్రవారం రాత్రి నుంచే గురుగ్రామ్ సెక్టర్ 56లోని కేంద్రీయ పార్క్ విహార్‌లో ఉన్న ధ్రువ్ రాఠీ నివాసం వద్ద దాదాపు 50 మంది పోలీసులు గుమిగుడారు. చివరికి శనివారం ఉదయం 7.50 గంటల కు రాఠీ ఇంట్లోకి వెళ్లారు. నిరసనల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లొద్దని పోలీసులు చెప్పినట్టు, ధ్రువ్ రాఠీ వినకపోవడంతో ఆయన్ని అదుపులోకి తీసుకునట్టు తెలుస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Abhijeet Dipke | సొంత ప్రజలతోనే యుద్ధం చేస్తున్న మోదీ సర్కార్: అభిజీత్ దీప్కే
అక్టోబర్ 10, 2026

CJP Protest | ఢిల్లీలో అప్రకటిత కర్ఫ్యూ.. రాత్రికి రాత్రే 400 మందికిపైగా అరెస్ట్
అక్టోబర్ 10, 2026

Jantar Mantar Protest | ఢిల్లీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు.. కేంద్రంపై సీజేపీ విమర్శలు..
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | మీ పని మీరు చూసుకోండి.. ఎలాన్ మస్క్‌కు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్..
- ●Abhijeet Dipke | సొంత ప్రజలతోనే యుద్ధం చేస్తున్న మోదీ సర్కార్: అభిజీత్ దీప్కే
- ●Micro Borrowing | మైక్రో ఫైనాన్స్ లోన్లను తీసుకుంటున్నారా.. ఈ 5 రిస్క్‌లు తెలుసుకోండి..
- ●Gold Investment | ఐఫోన్ వద్దనుకుని బంగారం కొన్నాడు.. 3 ఏళ్లలో రెండింతలకు పైగా లాభం..
- ●Aurora College | విద్యార్థినులు బట్టలు మార్చుకుంటుండగా ఫొటోలు.. అరోరా కాలేజీ హాస్టల్లో సిబ్బంది అరాచకాలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న జోష్.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..

RS Praveen Kumar | మీ పని మీరు చూసుకోండి.. ఎలాన్ మస్క్‌కు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్..

Abhijeet Dipke | సొంత ప్రజలతోనే యుద్ధం చేస్తున్న మోదీ సర్కార్: అభిజీత్ దీప్కే

Micro Borrowing | మైక్రో ఫైనాన్స్ లోన్లను తీసుకుంటున్నారా.. ఈ 5 రిస్క్‌లు తెలుసుకోండి..

Gold Investment | ఐఫోన్ వద్దనుకుని బంగారం కొన్నాడు.. 3 ఏళ్లలో రెండింతలకు పైగా లాభం..



