త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Resigns | ప్ర‌భుత్వ ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌.. పంజాబ్ మంత్రి లాల్‌జిత్ సింగ్ రాజీనామా..!

Minister Resigns | పంజాబ్‌కు చెందిన ర‌వాణాశాఖ మంత్రి లాల్‌జిత్ సింగ్ భుల్ల‌ర్ శ‌నివారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అమృత్‌స‌ర్‌లోని పంజాబ్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్ జిల్లా మేనేజ‌ర్ గ‌గ‌న్‌దీప్ సింగ్ రంధావా ఆత్మ‌హ‌త్య సంబంధించిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ ఆదేశాల మేర‌కు రాజీనామా చేసిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

P

National | Published On Mar 21, 2026, 5.28 pm IST

Minister Resigns | ప్ర‌భుత్వ ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌.. పంజాబ్ మంత్రి లాల్‌జిత్ సింగ్ రాజీనామా..!
Advertisement

Minister Resigns | పంజాబ్‌కు చెందిన ర‌వాణాశాఖ మంత్రి లాల్‌జిత్ సింగ్ భుల్ల‌ర్ శ‌నివారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అమృత్‌స‌ర్‌లోని పంజాబ్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్ జిల్లా మేనేజ‌ర్ గ‌గ‌న్‌దీప్ సింగ్ రంధావా ఆత్మ‌హ‌త్య సంబంధించిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ ఆదేశాల మేర‌కు రాజీనామా చేసిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. భుల్ల‌ర్ త‌ర‌న్ తార‌న్ జిల్లా ప‌ట్టి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వివాదాస్పద వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో భుల్లర్ రాజీనామాను సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. అలాగే, ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరపాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని సీఎం ఆదేశించారు. అధికారి మ‌ర‌ణానికి దారి తీసిన ప‌రిస్థితులు, ఇందులో మంత్రి ప్ర‌మేయంపై విచార‌ణ‌కు సీఎం ఆదేశించిన‌ట్లుగా ప్ర‌భుత్వ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.

ప‌ట్టిలో అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న రంధావా ర‌సాయ‌న ప‌దార్థం తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ మేర‌కు వీడియోను రికార్డు చేశార‌ని, అందులో ఆత్మ‌హ‌త్య‌కు మంత్రి కార‌ణ‌మ‌ని ఆరోపించిన‌ట్లుగా తెలుస్తోంది. మంత్రి త‌న‌ను తీవ్రంగా వేధించార‌ని, మంత్రి స‌హాయ‌కుడికి టెండ‌ర్ ఇవ్వాల‌ని త‌న‌పై ఒత్తిడి చేశార‌ని ఆరోపించారు. బిడ్డ‌ర్‌కు అనుకూలంగా ప‌ని చేసేందుకు తాను నిరాక‌రించాడ‌ని, దాంతో ఆయ‌న‌పై దాడి జ‌రిగింద‌ని వీడియోలో పేర్కొన్న‌ట్లుగా స‌మాచారం. అంతేకాకుండా అభ్యంత‌ర‌క‌రంగా వీడియోను చిత్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లుగా స‌మాచారం.

ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బాజ్వా, అమృత్‌సర్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా, శిరోమణి అకాలీ దళ్ నాయకులు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, విక్రమ్ సింగ్ మజీతియాలతో సహా ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో వేదిక‌గా మండిప‌డ్డారు. మంత్రిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి కేబినెట్ నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. మృతి ఫోన్‌ని భ‌ద్ర‌ప‌రిచి, సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆప్ ప్ర‌భుత్వం ప‌నితీరుపై ప్ర‌శ్న‌లు సంధించారు. చ‌ట్టం అంద‌రికీ స‌మానంగా వ‌ర్తించాల‌ని, ఈ కేసులో ఏమాత్రం ఆల‌స్యం జ‌రిగినా నిస్పాక్షిక విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement