త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raghav Chadha | ఉడాన్ యాత్రి కేఫ్‌లో టీ తాగిన ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా..!

Raghav Chadha | విమానాశ్రయాల్లో అధిక ధరల అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ప్రయాణికులకు తక్కువ ధరల్లో ఆహారం అందించే ‘ఉడాన్ యాత్రి కేఫ్‌’పై ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టు ఈ అంశాన్ని హైలైట్ చేసింది. ముంబ‌యి ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న కేఫ్‌లో రూ.10కే టీ తాగారు.

P

National | Published On Mar 30, 2026, 4.01 pm IST

Raghav Chadha | ఉడాన్ యాత్రి కేఫ్‌లో టీ తాగిన ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా..!
Advertisement

Raghav Chadha | విమానాశ్రయాల్లో అధిక ధరల అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ప్రయాణికులకు తక్కువ ధరల్లో ఆహారం అందించే ‘ఉడాన్ యాత్రి కేఫ్‌’పై ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టు ఈ అంశాన్ని హైలైట్ చేసింది. ముంబ‌యి ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న కేఫ్‌లో రూ.10కే టీ తాగారు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న త‌న అనుభ‌వాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. తన వీడియో పోస్టులో “ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఖర్చు తక్కువ, సేవలు కూడా బాగున్నాయి. డబ్బుకు తగిన విలువ లభిస్తోంది” అని పేర్కొన్నారు. సాధారణంగా విమానాశ్రయాల్లో అధిక ధరలకు అలవాటు పడిన ప్రయాణికులు ఈ కేఫ్‌లను త‌క్కువ ధ‌ర‌లు ఉండ‌డాన్ని అభినందిస్తున్నారు.

ఇది ఒక్కరోజులో వచ్చిన ఆలోచన కాదు. ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద ప్రణాళికలో భాగమే ఈ ‘ఉడాన్ యాత్రి కేఫ్‌’. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో తొలిసారిగా ఈ కేఫ్‌ను ప్రారంభించారు. తక్కువ ధరల్లో ఆహార పదార్థాలను అందించడమే ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ప్రారంభించాయి. విమానాశ్రయాల్లో వాట‌ర్ బాటిల్ రూ.100 వరకు, సమోసా వంటి స్నాక్స్ రూ.150-200 వరకు ఉండేవి. మధ్యతరగతి ప్రయాణికులకు ఇది భారంగా మారేది. ఈ పరిస్థితిని మార్చడ‌మే ల‌క్ష్యంగా ఈ కేఫ్‌ల‌ను ప్రారంభించింది. డిసెంబ‌ర్ 2024లో కోల్‌క‌తాలోని నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ విమానాశ్ర‌యంలో తొలి కేఫ్‌ను ప్రారంభించారు.

అప్పటి నుంచి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 2026 నాటికి దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఎక్కువ విమానాశ్రయాల్లో ఈ కేఫ్‌లను విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. విమానాశ్రయాల్లో అధిక ధరలపై ప్రయాణికులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రయాణికులు, తొలిసారి విమాన ప్రయాణం చేసే వారికి ఇది ఇబ్బందిగా మారేది. ఈ నేపథ్యంలో తక్కువ ధరల్లో టీ, స్నాక్స్, భోజనం అందిస్తూ ఉడాన్ యాత్రి కేఫ్‌లు ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇటీవ‌ల ఆప్ రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా సైతం ఎయిర్‌పోర్టుల్లో అధిక ధ‌ర‌ల‌ను ప్ర‌స్తావించిన విష‌యం తెలిసిందే. అధిక ధ‌ర‌ల‌పై కేంద్రాన్ని నిల‌దీశారు. సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా ఉడాన్ యాత్రి కేఫ్‌ల‌ను విస్త‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement