AAP | రాఘవ్ చద్దా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అరవింద్ కేజ్రీవాల్..!
AAP | రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆధ్వర్యంలో పలువురు ఎంపీలు పార్టీకి రాజీనామా చేయడం ఆమ్ ఆద్మీ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై ఆప్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీని వీడిన వారిని ‘ద్రోహులు’గా తీవ్రంగా విమర్శించారు.
AAP | రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆధ్వర్యంలో పలువురు ఎంపీలు పార్టీకి రాజీనామా చేయడం ఆమ్ ఆద్మీ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై ఆప్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీని వీడిన వారిని ‘ద్రోహులు’గా తీవ్రంగా విమర్శించారు. పంజాబ్ ప్రజలు ఈ చర్యను ఎప్పటికీ మర్చిపోరని, క్షమించరని స్పష్టం చేశారు. ఈ పరిణామాల వెనుక భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఉందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వరకు నాయకులు ఆరోపణలు గుప్పించారు. ‘పంజాబ్ ప్రజల నమ్మకానికి బీజేపీ మరోసారి ద్రోహం చేసింది’ అని కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ లోటస్’ అమలు చేశారని ఆరోపించారు.
పార్టీని విడిచిన ఎంపీలపై సంజయ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. ‘ఆమ్ ఆద్మీ పార్టీకి, పంజాబ్ ప్రజలకు ఎప్పుడెప్పుడు ద్రోహం జరిగిందో, ప్రజలు తగిన సమాధానం ఇచ్చారు. ఈసారి కూడా అదే జరుగుతుంది’ అన్నారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీలో చేరి నిజాయతీ గురించి ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. అలాగే, రైతు హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కుటుంబానికి చెందినవారు ఉన్న పార్టీలో చేరడంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఇది అత్యంత దిగజారుడు చర్యగా పేర్కొంటూ పార్టీ అధికార ప్రతినిధి అనురాగ్ దండా స్పందించారు. మరోవైపు, పంజాబ్ యూనిట్ ప్రధాన కార్యదర్శి బల్తేజ్ పన్నూ మాట్లాడుతూ కేంద్ర సంస్థలను ఉపయోగించి ఆప్‌ను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ ప్రక్రియలో భాగంగా రాఘవ్ చద్దాను అమిత్ షా ఒక సాధనంగా ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
- ●KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్
- ●Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
- ● స్క్రీన్ వెనుక మాయాజాలం: డీప్‌ఫేక్ మూలాల్ని నరుకుతున్న ‘డిజిటల్ డిటెక్టివ్లు’

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ

Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్






