త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Neha Bora | నేహా బోరాపై ఇంకుతో దాడి.. దేశ వ్య‌తిరేకి అంటూ నినాదాలు

Neha Bora | ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేష‌న్(AISA) ప్రెసిడెంట్ నేహా బోరా( Neha Bora )పై ఇంకు దాడి జ‌రిగింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఆయా నియామ‌క ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని పేర్కొంటూ అసెంబ్లీ ముట్ట‌డికి బ‌య‌ల్దేరారు. ఈ క్ర‌మంలో ర్యాలీలో పాల్గొన్న నేహా బోరాపై ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఇంకుతో దాడికి పాల్ప‌డ్డాడు.

S

National | Published On Aug 7, 2026, 6.01 pm IST

Neha Bora | నేహా బోరాపై ఇంకుతో దాడి.. దేశ వ్య‌తిరేకి అంటూ నినాదాలు
Advertisement

Neha Bora | త్రినేత్ర‌.న్యూస్ : ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేష‌న్(AISA) ప్రెసిడెంట్ నేహా బోరా( Neha Bora )పై ఇంకు దాడి జ‌రిగింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఆయా నియామ‌క ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని పేర్కొంటూ అసెంబ్లీ ముట్ట‌డికి బ‌య‌ల్దేరారు. ఈ క్ర‌మంలో ర్యాలీలో పాల్గొన్న నేహా బోరాపై ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఇంకుతో దాడికి పాల్ప‌డ్డాడు. ఆమె దేశ వ్య‌తిరేకి అంటూ నినాదాలు చేశాడు స‌ద‌రు వ్య‌క్తి.

ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్ సంఘాల ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు అసెంబ్లీ ముట్ట‌డికి బ‌య‌ల్దేరారు. బిర్సా చౌక్ వ‌ద్దకు రాగానే నేహా బోరాపై ఇంకుతో దాడికి పాల్ప‌డ్డాడు.

ఈ ఘ‌ట‌న‌పై నేహా బోరా స్పందించారు. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌రిగిన నిర‌స‌న‌ల్లో పెల్లెట్ గ‌న్ కాల్పుల‌కు, లాఠీఛార్జీల‌కే భ‌య‌ప‌డ‌లేదు.. ఈ ఇంకు దాడుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు.. వెన‌క్కి త‌గ్గే స‌మ‌స్య లేనే లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

తాము ప్ర‌శాంతంగా ర్యాలీ నిర్వ‌హించాం. ఓ వ్య‌క్తి గుంపులో నుంచి తోసుకుంటూ వ‌చ్చి ఇంకు దాడికి పాల్ప‌డ్డాడ‌ని ఏఐఎస్ఏ నాయ‌కురాలు శివాని తెలిపారు. ఇంకు దాడికి పాల్ప‌డింది బీజేపీ గూండాలే అని ఆమె ఆరోపించారు. ఈ దాడికి పాల్ప‌డ్డ వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోరా నేహా ఉమ‌ర్ ఖ‌లీద్ మ‌ద్ధ‌తుదారు.. ఆమె దేశ వ్య‌తిరేకి అని దాడికి పాల్ప‌డ్డ వ్య‌క్తి పేర్కొన్నాడు.

Advertisement
Advertisement