త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Model Schools | మోడల్‌ స్కూళ్లలో యోగా, ఆర్ట్‌, కంప్యూట‌ర్ టీచ‌ర్లు.. 776 పోస్టుల భ‌ర్తీ

Model Schools | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలోని మోడ‌ల్ స్కూళ్లలో (Model Schools) ఔట్‌సోర్సింగ్  సిబ్బంది నియామ‌కాల‌కు ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌ స్కూళ్లలో నాలుగు కేటగిరీలకు చెందిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని (Outsourcing Staff) నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.

G

Telangana | Published On Oct 29, 2026, 10.15 am IST

Model Schools | మోడల్‌ స్కూళ్లలో యోగా, ఆర్ట్‌, కంప్యూట‌ర్ టీచ‌ర్లు.. 776 పోస్టుల భ‌ర్తీ
Advertisement

Model Schools | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలోని మోడ‌ల్ స్కూళ్లలో (Model Schools) ఔట్‌సోర్సింగ్  సిబ్బంది నియామ‌కాల‌కు ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. మేడ్చ‌ల్‌, గ‌ద్వాల‌, కొత్త‌గూడెం జిల్లాలు, హైద‌రాబాద్ మిన‌హా.. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌ స్కూళ్లలో నాలుగు కేటగిరీలకు చెందిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని (Outsourcing Staff) నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఒక్కో పాఠశాలలో ఒక ఆర్ట్‌ టీచర్, ఒక యోగా టీచర్, ఒక కంప్యూటర్‌ టీచర్, ఒక లైబ్రేరియన్‌ను మొత్తం 776 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. నియామ‌కాలు చేప‌ట్టాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు.

అర్హులైన అభ్యర్థులను ఇప్పటికే ఉన్న ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా లేదా కొత్త ఏజెన్సీల ద్వారా నియమించుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆర్ట్‌ టీచర్, యోగా టీచర్, కంప్యూటర్‌ టీచర్‌కు (Computer Teacher) నెలకు రూ.22,750 చొప్పున, లైబ్రేరియన్‌కు రూ.19,500 చొప్పున వేతనం నిర్ణయించారు. ఈ నియామకాలు 2026 నవంబర్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు లేదా అవసరం ముగిసే వరకు.. ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటివరకు కొనసాగుతాయి. నియామకాలు నిర్దేశించిన అర్హతలు, వయోపరిమితి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.

అర్హతలు

ఆర్ట్‌ టీచర్‌ పోస్టుకు.. ఫైన్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ లేదా బ్యాచిలర్స్‌ డిగ్రీతోపాటు పెయింటింగ్, శిల్పకళ, కమర్షియల్‌ ఆర్ట్స్, ప్రింట్‌ మేకింగ్, యానిమేషన్‌ వంటి విభాగాల్లో అర్హత ఉండాలి.
యోగా టీచర్‌ పోస్టుకు.. గ్రాడ్యుయేషన్‌తోపాటు యోగాలో డిప్లొమా లేదా డిగ్రీ, యోగా స్పెషలైజేషన్‌తో బీఎడ్ లేదా బీపెఎడ్‌ అర్హతల్లో పేర్కొన్న నిబంధనలు వర్తిస్తాయి.
కంప్యూటర్‌ టీచర్‌ పోస్టుకు.. కంప్యూటర్‌ సైన్స్, ఐటీ, బీటెక్, బీఈ, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్‌ వంటి అర్హతలు ఉండాలి.
లైబ్రేరియన్‌ పోస్టుకు.. లైబ్రరీ సైన్స్‌ లేదా లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ లేదా బ్యాచిలర్స్‌ డిగ్రీ అవసరం.

వ‌యోప‌రిమితి: అభ్య‌ర్థులు 21 ఏండ్ల నుంచి 44 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

Advertisement
Advertisement