త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gun Miss Fire | ప‌డ‌క గ‌దిలో ‘తుపాకీ’ ఆట‌.. భార్య శ‌రీరంలోకి దూసుకెళ్లిన ‘బుల్లెట్’

Gun Miss Fire | భ‌ర్త స‌ర‌దా భార్య ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఓ భ‌ర్త‌ ప‌డ‌క గ‌దిలో తుపాకీతో ఆడుతుండ‌గా.. ప్ర‌మాద‌వ‌శాత్తు అది మిస్ ఫైర్ అయింది. ప‌క్క‌నే భార్య శ‌రీరంలోని బుల్లెట్ దూసుకెళ్లింది. ఆమె ప్రాణాలు కోల్పోవ‌డంతో.. భ‌ర్త కూడా అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

S

National | Published On Jan 22, 2026, 5.48 pm IST

Gun Miss Fire | ప‌డ‌క గ‌దిలో ‘తుపాకీ’ ఆట‌.. భార్య శ‌రీరంలోకి దూసుకెళ్లిన ‘బుల్లెట్’
Advertisement

Gun Miss Fire | త్రినేత్ర‌.న్యూస్ : భ‌ర్త స‌ర‌దా భార్య ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఓ భ‌ర్త‌ ప‌డ‌క గ‌దిలో తుపాకీతో ఆడుతుండ‌గా.. ప్ర‌మాద‌వ‌శాత్తు అది మిస్ ఫైర్ అయింది. ప‌క్క‌నే భార్య శ‌రీరంలోని బుల్లెట్ దూసుకెళ్లింది. ఆమె ప్రాణాలు కోల్పోవ‌డంతో.. భ‌ర్త కూడా అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అహ్మ‌దాబాద్‌కు చెందిన య‌శ్‌రాజ్‌సిన్హ్ గోహిల్‌కు రెండు నెల‌ల క్రితం రాజేశ్వ‌రి గోహిల్ అనే యువ‌తితో పెళ్లైంది. ఇటీవ‌లే అత‌నికి గుజ‌రాత్ మేరిటైమ్ బోర్డులో క్లాస్ -1 ఆఫీస‌ర్‌గా ఎంపిక‌య్యాడు. త్వ‌ర‌లోనే విదేశాల‌కు వెళ్లాల‌నే ప్లాన్‌లో కూడా ఉన్నారు ఈ కొత్త దంప‌తులు. అయితే బుధ‌వారం రాత్రి ఉన్న‌ట్టుండి.. త‌న లైసెన్స్‌డ్ రివాల్వ‌ర్‌తో గేమ్ ఆడాడు. మిస్ ఫైర్ జ‌రిగి.. భార్య శ‌రీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఇంకేముంది ప‌డ‌క గ‌దిలోనే భార్య ప్రాణాలు విడిచింది. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన భ‌ర్త య‌శ్‌రాజ్ సిన్హ్ 108 అంబులెన్స్‌కు కాల్ చేసి.. మ‌రో గ‌దిలోకి వెళ్లాడు. తాను కూడా అదే రివాల‌ర్వ్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. య‌శ్‌రాజ్‌సిన్హ్ గోహిల్ గుజ‌రాత్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్, రాజ్య‌స‌భ స‌భ్యుడు శ‌క్తిసిన్హ్ గోహిల్‌కు మేన‌ల్లుడు.

ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి మ‌నీశ్ దోసీ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. శ‌క్తిసిన్హ్ గోహిల్ కుటుంబం షాకింగ్‌లో ఉంద‌న్నారు. య‌శ్‌రాజ్ త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా బాగా తెలుసు. ఇటీవ‌లే గుజ‌రాత్ మేరిటైమ్ బోర్డు ఎగ్జామ్స్‌లో పాసై క్లాస్ -1 ఆఫీస‌ర్‌గా ఎంపిక‌య్యాడు. యూపీఎస్సీ ఎగ్జామ్స్‌కు కూడా ప్రిపేర‌వుతున్నాడు. ఈ కొత్త దంప‌తులు సంతోషంగా జీవిస్తున్నారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌నే ఆలోచ‌న కూడా నూత‌న దంప‌తుల‌కు ఉండే. అయితే య‌శ్‌కు తుపాకీతో ఆట‌లాడే అల‌వాటు ఉంది. ఈ క్ర‌మంలో మిస్ ఫైర్ జ‌రిగి భార్య శ‌రీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంట‌నే య‌శ్ 108 అంబులెన్స్‌కు స‌మాచారం అందించాడు. అంబులెన్స్ సిబ్బంది ఆమెను ప‌రిశీలించి, అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయింద‌ని నిర్ధారించారు. క్ష‌ణాల్లోనే య‌శ్‌రాజ్ మ‌రో గ‌దిలోకి వెళ్లి అదే రివాల‌ర్వ్‌తో కాల్చుకుని చ‌నిపోయాడు అని మ‌నీశ్ పేర్కొన్నారు.

భార్యాభ‌ర్త‌ల మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌న్నారు. కుటుంబ స‌భ్యులను విచారించడంతో పాటు 108 అంబులెన్స్ కాల్ రికార్డుల‌ను కూడా ప‌రిశీలిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement