త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Love in Jail | జైలు గోడ‌ల మధ్య చిగురించిన ప్రేమ‌.. పెళ్లికి పెరోల్ తీసుకున్న ల‌వ‌ర్స్‌

Love in Jail | వేర్వేరు హ‌త్య కేసుల్లో శిక్ష అనుభ‌విస్తున్న ఓ ఇద్ద‌రు ఖైదీల మ‌ధ్య ప్రేమ చిగురించింది. మ‌న‌సులు మ‌రింత ద‌గ్గ‌ర కావ‌డంతో మ‌నువాడాల‌నుకున్నారు. ఇంకేముంది.. త‌మ ప్రేమ బంధం గురించి జైలు అధికారుల‌కు చెప్పేశారు.

S

National | Published On Jan 23, 2026, 2.14 pm IST

Love in Jail | జైలు గోడ‌ల మధ్య చిగురించిన ప్రేమ‌.. పెళ్లికి పెరోల్ తీసుకున్న ల‌వ‌ర్స్‌
Advertisement

Love in Jail | త్రినేత్ర‌.న్యూస్ : వేర్వేరు హ‌త్య కేసుల్లో శిక్ష అనుభ‌విస్తున్న ఓ ఇద్ద‌రు ఖైదీల మ‌ధ్య ప్రేమ చిగురించింది. మ‌న‌సులు మ‌రింత ద‌గ్గ‌ర కావ‌డంతో మ‌నువాడాల‌నుకున్నారు. ఇంకేముంది.. త‌మ ప్రేమ బంధం గురించి జైలు అధికారుల‌కు చెప్పేశారు. ఆ త‌ర్వాత‌ రాజ‌స్థాన్ హైకోర్టును ఆశ్ర‌యించారు. హైకోర్టు కూడా వారి ప్రేమ పెళ్లి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 15 రోజుల పెరోల్ కూడా మంజూరు చేసింది. ఈ క్ర‌మంలో ప్రేమ ఖైదీలు.. ఇవాళ ఒక్క‌టి కాబోతున్నారు.

ప్రియా సేథ్‌(34) అనే మ‌హిళ‌కు ప‌దేండ్ల క్రితం ఓ డేటింగ్ యాప్‌లో ఓ యువ‌కుడు ప‌రిచ‌య‌మయ్యాడు. కానీ అత‌నితో ఆమె ప్రేమ కొన‌సాగించ‌లేదు. ఆ యువ‌కుడిని అత్యంత దారుణంగా హ‌తమార్చ‌డంతో ప్రియా సేథ్ జైలు పాలైంది. గ‌త ప‌దేండ్ల నుంచి జైపూర్‌లోని సంగ‌నేర్ ఓపెన్ జైల్లో శిక్ష అనుభ‌విస్తుంది.

ఇదే జైల్లో హ‌నుమాన్ ప్ర‌సాద్(29) అనే యువ‌కుడు కూడా హ‌త్య కేసులో శిక్ష అనుభ‌విస్తున్నాడు. ఇత‌నేమో త‌న ప్రియురాలి భ‌ర్త‌తో పాటు ఆమె పిల్ల‌ల‌ను చంపేశాడు. దీంతో 2017 నుంచి హ‌నుమాన్ ప్ర‌సాద్ జైల్లో ఊచ‌లు లెక్కిస్తున్నాడు. అయితే హ‌నుమాన్ ప్ర‌సాద్‌కు ప్రియా సేథ్‌తో ఆరు నెల‌ల క్రితం మాట‌లు క‌లిశాయి. ఈ మాటలు కాస్త ప్రేమ‌ను పంచాయి. జైలు గోడ‌ల మ‌ధ్య‌నే వీరి ప్రేమ మ‌రింత చిగురించింది. ప్రేమ‌తోనే ఆగిపోలేదు.. ఆరు నెల‌ల్లోనే వీరి మ‌న‌సులు కూడా మ‌రింత ద‌గ్గ‌ర‌వ‌డంతో మ‌నువాడాల‌నుకున్నారు.

ఈ క్ర‌మంలో త‌మ ప్రేమ విష‌యాన్ని జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లి చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నామ‌ని, పెరోల్ ఇవ్వాల‌ని రాజ‌స్థాన్ హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో.. కోర్టు కూడా వారి ప్రేమ పెళ్లికి ఓకే చెప్పేసింది. ప్ర‌స్తుతం 15 రోజుల పెరోల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ప్రేమ జంట‌.. రాజ‌స్థాన్‌లోని అల్వార్‌లో ఒక్క‌టి కాబోతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement