త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ (Registration) చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

G

Telangana | Published On Aug 19, 2026, 5.52 am IST

Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ (Registration) చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 22 ఏ నిషేధిత భూముల (22A Prohibited Lands) రిజిస్ట్రేష‌న్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రిజిస్ట్రేష‌న్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో ప‌రిశీలించి అది ప్రైవేటు భూమి అయితే వెంట‌నే రిజిస్ట్రేష‌న్ చేస్తారన్నారు.

ద‌ళారుల‌ను ఆశ్రయించొద్దు..

జిల్లా క‌లెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్నంగా ప‌రిశీలించి, శాశ్వ‌త ప‌రిష్కారానికి స‌రైన జాబితాను రూపొందిస్తార‌ని చెప్పారు. అందులో ఎలాంటి త‌ప్పులు లేకుండా చూడాల‌ని, ఈ ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించాన‌ని తెలిపారు. ప్రజ‌లు త‌మ భూ హ‌క్కుల విష‌యంలో ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌న్నారు. ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రైవేటు భూముల‌కు సంబంధించి ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వ‌మ‌ని తెలిపారు. 22 ఏ భూముల విష‌యంలో ద‌ళారులు, మ‌ధ్యవ‌ర్తుల‌ను ఆశ్రయించ‌వ‌ద్దని, ఎలాంటి పుకార్లు, క‌ట్టు క‌థ‌ల‌ను న‌మ్మొద్ద‌ని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement