త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 2482 లోక‌ల్ బ్యాంక్ ఆఫీస‌ర్ పోస్టులు

BOB LBO Recruitment | బ్యాంకు ఉద్యోగార్థుల‌కు బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) మ‌రో గుడ్‌న్యూస్ అందించింది. ఇప్ప‌టికే మేనేజ‌ర్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు, ఐబీపీఎస్ ద్వారా క్ల‌ర్క్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్న బీఓబీ (BOB) మ‌రోసారి పెద్ద సంఖ్య‌లో పోస్టుల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

G

National | Published On Aug 19, 2026, 6.55 am IST

BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 2482 లోక‌ల్ బ్యాంక్ ఆఫీస‌ర్ పోస్టులు
Advertisement

BOB LBO Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: బ్యాంకు ఉద్యోగార్థుల‌కు బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) మ‌రో గుడ్‌న్యూస్ అందించింది. ఇప్ప‌టికే మేనేజ‌ర్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు, ఐబీపీఎస్ ద్వారా క్ల‌ర్క్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్న బీఓబీ (BOB) మ‌రోసారి పెద్ద సంఖ్య‌లో పోస్టుల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ (BOB LBO Recruitment) ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్‌ 7 వరకు దరఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి బేసిక్ పే రూ.48,480 నుంచి రూ.85,920+ ఇతర అలవెన్సులు ఉంటాయి. తెలంగాణ‌లో 50, ఆంధ్రప్రదేశ్‌లో 80 చొప్పున‌ పోస్టులు ఉన్నాయి.

పోస్టు పేరు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (Local Bank Officer)
మొత్తం ఖాళీలు: 2,482 (జ‌న‌ర‌ల్ 981, ఈడ‌బ్ల్యూఎస్ 303, ఓబీసీ 600, ఎస్సీ 358, ఎస్టీ 240)

తెలంగాణలో 50 (జ‌న‌ర‌ల్ 20, ఈడ‌బ్ల్యూఎస్ 5, ఓబీసీ 14, ఎస్సీ 8, ఎస్టీ 3), ఆంధ్రప్రదేశ్‌లో 80 (జ‌న‌ర‌ల్ 33, ఈడ‌బ్ల్యూఎస్ 8, ఓబీసీ 22, ఎస్సీ 12, ఎస్టీ 5), అత్య‌ధికంగా గుజ‌రాత్‌లో 400, మ‌హారాష్ట్ర‌లో 180, క‌ర్ణాట‌క‌లో 130 పోస్టులు ఉన్నాయి.

అర్హత: గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, షెడ్యూల్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లో కనీసం ఒక సంవత్సరం పోస్ట్‌-క్వాలిఫికేషన్‌ అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం త‌ప్ప‌నిస‌రి. 2026 ఆగ‌స్టు 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల‌ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ 5 ఏండ్లు, ఓబీసీ 3, పీడబ్ల్యూబీడీ అభ్య‌ర్థుల‌కు 15 ఏండ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్ (GD)/ ఇంటర్వ్యూ.

ఆన్‌లైన్ పరీక్ష.. ఇంగ్లిష్‌-30, బ్యాంకింగ్ నాలెడ్జ్-30, జనరల్ /ఎకానామిక్‌ అవేర్‌నెస్-30, రీజనింగ్ & క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్-30 నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో 120 ప్రశ్నలు, 120 మార్కులు, 120 నిమిషాల వ్యవధి ఉంటుంది. తప్పు సమాధానానికి 0.25 మార్కు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు రూ175.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 7
వెబ్‌సైట్‌: www.bankofbaroda.bank.in

మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్‌చేయండి..

Advertisement
Advertisement