త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malka Komaraiah – AVN Reddy | ప్రమోషన్లు ఎప్పుడిస్తారు? స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయండి

డీఎస్సీ ఖాళీల భర్తీ, బదిలీలు-పదోన్నతుల వార్షిక క్యాలెండర్‌పై సీఎస్ సంజయ్ జాజుతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి కీలక చర్చలు జరిపారు.

J

Telangana | Published On Sep 17, 2026, 6.22 pm IST

Malka Komaraiah – AVN Reddy | ప్రమోషన్లు ఎప్పుడిస్తారు? స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయండి
Advertisement
  • ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం సీఎస్ సంజయ్ జాజు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో ఎమ్మెల్సీలు భేటీ
  • డీఎస్సీ (DSC) ద్వారా టీచర్ పోస్టుల భర్తీతో పాటు బదిలీలు, పదోన్నతులకు పక్కాగా వార్షిక క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్
  • స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎం, ఎంఈవో ప్రమోషన్లు కల్పించి, 260 అప్‌గ్రేడెడ్ హైస్కూళ్లలో పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి
  • కేజీబీవీ (KGBV), సమగ్ర శిక్ష (SSA) సిబ్బంది సమస్యలు, హెల్త్‌కేర్ ట్రస్ట్‌లో ప్రాతినిధ్యంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

Malka Komaraiah - AVN Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ విద్యాశాఖలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి చొరవ చూపారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో వారు గురువారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.

డీఎస్సీ భర్తీ, ప్రమోషన్ల క్యాలెండర్

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ (DSC) ద్వారా తక్షణమే భర్తీ చేయాలని ఎమ్మెల్సీలు కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టమైన వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఉద్యోగుల్లో అనిశ్చితి తొలగిపోతుందని స్పష్టం చేశారు.

స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎం, ఎంఈవో పదోన్నతులు

దీర్ఘకాలంగా ప్రమోషన్లు లేక నిరీక్షిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు (School Assistants) న్యాయం చేయాలని ఎమ్మెల్సీలు కోరారు. వెంటనే జీహెచ్ఎం (GHM), ఎంఈవో (MEO) ప్రమోషన్లు కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా అప్‌గ్రేడ్ అయిన 260 హైస్కూళ్లలో జీహెచ్ఎం పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలని, ప్రతి మండలానికి పూర్తిస్థాయి రెగ్యులర్ ఎంఈవోలను నియమించాలని డిమాండ్ చేశారు. ముందుగా ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే సాధారణ బదిలీలు చేపట్టాలని సూచించారు.

కేజీబీవీ, సమగ్ర శిక్ష సమస్యలు

సమగ్ర శిక్ష (SSA), కేజీబీవీ (KGBV) విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల ఆర్థిక, సర్వీసు సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించాలని కోరారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో టీపీయూఎస్ (TPUS) సంఘం ప్రతినిధులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను వెలికితీసేలా '25 Crore Children’s Dreams' కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్త పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక పోటీలు నిర్వహించాలని ఎమ్మెల్సీలు ప్రతిపాదించారు. విద్యావ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.

Advertisement
Advertisement