త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

7 Year Old Girl Assault | 7 ఏళ్ల చిన్నారిపై దుండ‌గుడి ఘాతుకం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన రామ్ సింగ్ తేజ్ సింగ్ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించిన పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ఘ‌ట‌న డిసెంబ‌ర్ 4న జ‌రుగ‌గా, ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

J

National | Published On Dec 10, 2025, 3.53 pm IST

7 Year Old Girl Assault | 7 ఏళ్ల చిన్నారిపై దుండ‌గుడి ఘాతుకం
Advertisement

7 Year Old Girl Assault | దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు వ‌చ్చినా మ‌నుషులు మార‌డం లేదు. మ‌గాళ్లు ఇంకా మృగాళ్లుగా మారుతున్నారు. చిన్న‌పిల్ల‌ల‌నూ వ‌ద‌ల‌డం లేదు. తాజాగా గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలిక‌పై ఓ దుండ‌గుడు కీచ‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. ఆ బాలిక ప్రైవేట్ పార్ట్స్‌లో రాడ్ పెట్టి చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడు.

ఆ బాలిక‌ను లొంగ‌దీసుకోవాలని అనుకున్న ఆ దుండ‌గుడు బాలిక లొంగ‌క‌పోయే స‌రికి త‌న‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి పెట్టాడు. దారుణంగా కొట్టాడు. దీంతో ఆ బాలికకు తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆ బాలిక ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన రామ్ సింగ్ తేజ్ సింగ్ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించిన పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ఘ‌ట‌న డిసెంబ‌ర్ 4న జ‌రుగ‌గా, ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement