త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Warren Buffett | 48 ఏండ్లుగా ఒక్క గ్లాస్‌ మంచి నీళ్లు ముట్ట‌ని వారెన్ బ‌ఫెట్‌

Warren Buffett | ప్ర‌ముఖ బిలియ‌నీర్‌, పెట్టుబ‌డిదారుడు వారెన్ బఫెట్ (Warren Buffett) గురించిన ఓ విష‌యం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది. 96 ఏండ్ల బ‌ఫెట్‌ గత 48 ఏండ్ల‌గా మంచినీటికి దూరంగా ఉంటున్నార‌ట‌.

G

International | Published On Nov 1, 2026, 7.19 am IST

Warren Buffett | 48 ఏండ్లుగా ఒక్క గ్లాస్‌ మంచి నీళ్లు ముట్ట‌ని వారెన్ బ‌ఫెట్‌
Advertisement

Warren Buffett | త్రినేత్ర న్యూస్‌: ప్ర‌ముఖ బిలియ‌నీర్‌, పెట్టుబ‌డిదారుడు వారెన్ బఫెట్ (Warren Buffett) గురించిన ఓ విష‌యం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది. 96 ఏండ్ల బ‌ఫెట్‌ గత 48 ఏండ్ల‌గా మంచినీటికి దూరంగా ఉంటున్నార‌ట‌. 1970ల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కనీసం ఒక్క చుక్క మంచి నీరు (Plain Water) కూడా తాగలేద‌ట‌. మరో ప్రముఖ బిలియనీర్, హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్‌మాన్ (Bill Ackman) ఈక్విటీ మేట్స్ ఇన్వెస్టింగ్ (Equity Mates Investing podcast) అనే పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. మంచి నీటికి బ‌దులు ఆయ‌న రోజూ ‘చెర్రీ కోక్’ (Cherry Coke) సోడానే తాగుతార‌ని తెలిపారు.

గ‌తంలో ఒక‌సారి బ‌ఫెట్ త‌న ఇంటికి విందుకు వ‌చ్చార‌ని, భోజ‌న‌ స‌మ‌యంలో సాధారణ నీటిని, సోడా నీటిని (Sparkling Water) సున్నితంగా తిరస్కరించార‌ని చెప్పారు. త‌న‌కు అల‌వాటైన సోడానే అడిగార‌ని తెలిపారు. దీంతో మీరు అస్స‌లు నీరు తాగ‌రా? అని అడిగితే.. తాను నీళ్లు తాగి 48 ఏండ్లు అవుతున్న‌ద‌ని అని బ‌ఫెట్ బ‌దులిచ్చార‌ని పేర్కొన్నారు. కాగా, గ‌తంలో కూడా బ‌ఫెట్ కుమార్తె సూసీ బ‌ఫెట్ ఇదే విష‌యాన్ని వెళ్ల‌డించారు. 2009, 2017లో వచ్చిన డాక్యుమెంటరీలలో.. `నా జీవితంలో మా నాన్న ఒక్క చుక్క మంచి నీరు తాగడం కూడా నేను చూడలేదు, ఆయన అస్సలు నీళ్లు తాగరు` అని సూసీ చెప్పారు.

బఫెట్, రోజుకు కనీసం 5 కాన్ల కోకాకోలా తాగుతారనే ప్ర‌చారం వాడుక‌లో ఉంది. తన రోజువారీ 2,700 క్యాలరీల ఆహారంలో పావు వంతు భాగం కోకాకోలా నుంచే వస్తుందని ఆయనే స్వయంగా గతంలో చెప్పారు. నేను రోజుకు కనీసం ఐదు 12 ఔన్స్‌ల కోకాకోలాను తాగుతాన‌ని తెలిపారు. 1986 వరకు పెప్సీ తాగిన బఫెట్, ఆ తర్వాత చెర్రీ కోక్‌కు మారిపోయారు. కాగా, బ‌ఫెట్‌ రోజుకు 5 క్యాన్ల కోకాకోలా తాగుతారని మ‌రోవైపు ప్ర‌ముఖ బ్రిటిష్ రచయిత గ్లెన్ ఆర్నాల్డ్ (Glen Arnold) తన పుస్తకం `ది డీల్స్ ఆఫ్ వారెన్ బఫెట్ వాల్యూమ్ 2: ది మేకింగ్ ఆఫ్ ఎ బిలియనీర్`లో రాశారు.

బఫెట్ కేవలం నీళ్లకు దూరం కావడమే కాకుండా.. మెక్‌డొనాల్డ్స్ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, హాట్ డాగ్స్, ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు వంటి జంక్ ఫుడ్‌ను కూడా అమితంగా తింటారు. 6 ఏళ్ల చిన్నపిల్లాడికి ఎలాంటి ఆహారం ఇష్టముంటుందో, తానూ అదే తింటానని ఆయన సరదాగా చెప్తుంటారు. కోకాకోలా (Coca-Cola) కంపెనీలో బ‌ఫెట్‌కు చెందిన 'బెర్క్‌షైర్ హాత్వే' సంస్థకు దాదాపు 9 శాతానికిపైగా షేర్లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

ట్యాగ్స్:

Bill AckmanCherry CokeCoca ColaGlen ArnoldPlain WaterSparkling WaterWarren Buffett
Advertisement
Advertisement