Mother Kills Son | మద్యానికి బానిసై వేధిస్తున్నాడని.. కన్నకొడుకును కత్తెరతో పొడిచి కడతేర్చింది..
Mother Kills Son | కొడుకు మద్యానికి (Alcohol Adict) బానిసయ్యాడు. రోజూ తాగడానికి డబ్బు కోసం వేధిస్తున్నాడు. భరించలేక ఆ తల్లి కొడుకుని దారుణంగా (Mother Kills Son) హత్యచేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో (Anantapur) చోటుచేసుకుంది.
Andhra pradesh | Published On Jul 14, 2026, 7.54 am IST
Mother Kills Son | త్రినేత్ర.న్యూస్: కొడుకు మద్యానికి (Alcohol Adict) బానిసయ్యాడు. రోజూ తాగడానికి డబ్బు కోసం వేధిస్తున్నాడు. భరించలేక ఆ తల్లి కొడుకుని దారుణంగా (Mother Kills Son) హత్యచేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో (Anantapur) చోటుచేసుకుంది.
అనంతపురం నగరానికి చెందిన బోనాల సునీత, సురేంద్ర (28) తల్లీ కొడుకులు. జులాయిగా తిరుగుతున్న సురేంద్ర మద్యానికి బానిసైయ్యాడు. రోజూ తాగడానికి డబ్బులు కావాలంటూ తల్లిని వేధిస్తున్నాడు. రోజురోజుకు చిత్రహింసలు, మానసిక వేధింపులకు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కూడా తల్లీ కొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సునీత.. ఇంట్లో ఉన్న కత్తెరను తీసుకుని సురేంద్ర గొంతులో బలంగా పొడిచింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సునీతను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. వేధింపుల వల్లే హత్యకు పాల్పడిందా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ






