SIR | బెంగాల్ ఓటర్లలో గందరగోళం.. ఒకే ఊర్లో 4 వేల ఓట్ల తొలగింపు..
SIR | కేంద్ర ఎన్నికల సంఘం (CEC) చేపట్టిన ప్రత్యేక విస్తృత ఓటర్ల సవరణ (SIR) పశ్చిమ బెంగాల్ (West Bengal) ఓటర్లలో గందరగోళం సృష్టిస్తున్నది. సీఈసీ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఓటర్ల జాబితా నుంచి దాదాపు 91 లక్షల మందిని (Voters Deleted) తొలగించారు. ఇందులో ఒక్క మాల్దా జిల్లాలోనే 2.39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
SIR | త్రినేత్ర.న్యూస్: కేంద్ర ఎన్నికల సంఘం (CEC) చేపట్టిన ప్రత్యేక విస్తృత ఓటర్ల సవరణ (SIR) పశ్చిమ బెంగాల్ (West Bengal) ఓటర్లలో గందరగోళం సృష్టిస్తున్నది. సీఈసీ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఓటర్ల జాబితా నుంచి దాదాపు 91 లక్షల మందిని (Voters Deleted) తొలగించారు. ఇందులో ఒక్క మాల్దా జిల్లాలోనే 2.39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆ జిల్లాలోని మహిస్బతని గ్రామపంచాయతీలో 3700 ఓట్లు గల్లంతయ్యాయి. మహిస్బతని పంచాయతీ పరిధిలో కడమటలై, రహుత్రగం, బలౌట్ల, సుగబతన్ గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ సర్ ప్రక్రియకు ముందు మొత్తం 27000 మంది ఓటర్లు ఉండేవారు. తాజాగా వెలువడిన జాబితాలో 3700 ఓటర్ల పేర్లు కనిపించకుండా పోయాయి. దీంతో వారందరికి ఈ నెల 23న జరుగనున్న మొదటి దశ పోలింగ్‌లో పాల్గొనే అవకాశం లేకుండాపోయింది.
ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించాలని ఎన్నికల అధికారులు సూచించారు. అయితే వాటిని ఎక్కడ ఇవ్వాలి, ఎప్పటిలోపు ఇవ్వాలనే విషయమై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ సరైన పత్రాలు సమర్పించినప్పటికీ మొదటి దశ ఎన్నికల్లో వారు ఓటు వేసే అవకాశం మాత్రం ఉండదు. కాగా, మహిస్బతనిలోని ప్రతి పోలింగ్ బూత్‌లో సుమారు 400 నుంచి 500 ఓటర్ల పేర్లను తొలగించారని ఓ వ్యక్తి తెలిపారు. ఒక్క 23వ నంబర్ పోలింగ్ బూత్‌లోనే 428 మంది పేర్లు గల్లంతయ్యాయని చెప్పారు. 294 స్థానాలకు గాను మొదటిదశలో 152 స్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరుగనుండటం గమనార్హం.
గత ఏడాది అక్టోబరు చివరి నాటికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 7.66కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ‘సర్’ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 90.83 లక్షల ఓటర్లను తొలగించారు. 60.06 లక్ష్ల ఓటర్లను అనుమానాస్పద, పెండింగ్ జాబితాలో చేర్చారు. న్యాయాధికారుల పరిశీలన తర్వాత 27.16 లక్షల ఓట్లు తీసేశారు. మిగిలిన 32.68 లక్షల ఓట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించి జాబితాతాల్లో పేర్లను పునరుద్ధరించారు.
బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా అయిన ఉత్తర 24 పరగణాల జిల్లాలో 3.25 లక్షల ఓట్లు, మాల్దాలో 2.39 లక్షలు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 2.23 లక్షలు, పూర్వ వర్ధమాన్ జిల్లాలో 2.09 లక్షలు.. నాదియా జిల్లాలో 2.98 లక్షల ఓట్లను తీసేశారు. నాదియా, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో మతువా వర్గీయుల జనాభా ఎక్కువగా ఉంటారు.
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






