త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UP Viral Wedding | అది ఉత్తుత్తి పెండ్లి.. సోష‌ల్ మీడియా ప్రాంక్‌..

UP Viral Wedding | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమ్రోహా (Amroha) జిల్లాలో జరిగిన ఒక వింత వివాహం (UP Viral Wedding) అంతా సోష‌ల్ మీడియా ప్రాంక్ (Social Media Prank) అని తేలింది. అది ఉత్తుత్తి పెండ్లి అని, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యేందుకే అలా చేశామ‌ని వారు వెల్ల‌డించారు.

G

National | Published On Jul 29, 2026, 6.45 am IST

UP Viral Wedding | అది ఉత్తుత్తి పెండ్లి.. సోష‌ల్ మీడియా ప్రాంక్‌..
Advertisement

UP Viral Wedding | త్రినేత్ర‌.న్యూస్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమ్రోహా (Amroha) జిల్లాలో జరిగిన ఒక వింత వివాహం (UP Viral Wedding) అంతా సోష‌ల్ మీడియా ప్రాంక్ (Social Media Prank) అని తేలింది. అది ఉత్తుత్తి పెండ్లి అని, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యేందుకే అలా చేశామ‌ని వారు వెల్ల‌డించారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ముగ్గురు అక్కచెల్లెళ్లు.. పెండ్లి తర్వాత విడిపోవడం ఇష్టం లేక ఒకే వ్యక్తిని పెళ్లాడిట్లు ఈ నెల‌ 17న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ (Viral Wedding Video) అయిన విష‌యం తెలిసిందే. అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన సరోజ్, సావిత్రి, సంతోశ్‌ అనే ముగ్గురు యువతులు ఒక గుడిలో వికాస్ అలియాస్ విక్కు అనే యువకుడితో ఏడడుగులు వేసిన‌ట్లు అందులో ఉంది. అయితే దీనిపై ఆన్‌లైన్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. స్పందించిన యూపీ మహిళా సంక్షేమ కమిటీ (CWC) అధికారులు ఆ ముగ్గురినీ విచారించారు.

ఈ సంద‌ర్భంగా వారు చెప్పిన విషయాలను విని నోరెళ్లబెట్టడం అధికారుల వంత‌యింది. అది వైరలయ్యేందుకు తీసుకున్న వీడియో మాత్రమేనని వారు వెల్లడించారు. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు తీసిన ప్రాంక్‌ మాత్రమేనని చెప్పుకొచ్చారు. తమపై ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ (Online Trolling) ఘోరంగా ఉందని, అది నిజంగా పెళ్లేనంటూ అబద్ధం చెప్పినందుకు పశ్చాత్తాప పడుతున్నారు. ఇకనైనా వేధింపులను ఆపాలని వారు అభ్య‌ర్థించారు. ఆ ముగ్గురు యువ‌తుల్లో ఒకరు మైనర్‌ అంటూ తమకు మూడు రోజుల క్రితం అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు సీడబ్ల్యూసీ చైర్మన్‌ అతులేశ్‌ కుమార్‌ భరద్వాజ్‌ వివరించారు. ముగ్గురి నుంచి వాంగ్మూలాలను సేకరించామని, వీరిలో ఒకరు మైనర్‌ అని తేలింద‌న్నారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామన్నారు.

అసలు వీరెవరు?

ముగ్గురు వ‌ధువుల్లో ఇద్దరు సొంత అక్కచెల్లెళ్లు కాగా, మరొకరు వారి బంధువు మెహర్‌పూర్‌కు చెందిన ఆల్కా. ఈ ముగ్గురూ కలిసి చేసే సోషల్ మీడియా వీడియోలకు వికాస్‌ అలియాస్‌ విక్కు కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. శ్యాంపురి గ్రామానికి చెందిన అత‌డు గత ఆరు నెలలుగా వారి వీడియోల్లో అతనే ఆన్‌-స్క్రీన్ భర్తగా కూడా నటిస్తున్నాడు. వీరు నలుగురూ సోషల్‌ మీడియా కంటెంట్‌ క్రియేటర్లు, ఆన్‌లైన్‌లో బాగా ఫాలోయింగ్‌ ఉన్న వాళ్లు. అయితే, ముగ్గురు యువతులు ఒక్కరినే వివాహమాడటం సనాతన ధర్మానికి విరుద్ధమంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తాము మైనర్లమనీ, ఇష్టం వచ్చిన వారిని పెళ్లాడే హక్కు తమకుందని, పురాణాల్లోనూ ఇలాంటి ఉదాహరణలున్నాయంటూ వారు మొదట్లో కొట్టిపారేశారు.

కాగా, ముగ్గురు యువతులు, ఒక యువకుడి పెండ్లి తాను జరిపించలేదని చాముండ ఆలయ పూజారి స్పష్టం చేస్తున్నారు. వివాదాస్పద వీడియోలో ఉన్న ఆ నలుగురినీ ఈ నెల 23వ తేదీన పిలిపించి, వారి వయస్సును నిర్ధారించే పత్రాలను సమరి్పంచాలని, లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కోరామని హసన్‌పూర్‌ సీనియర్‌ ఎస్సై అమిత్‌ కుమార్‌ తెలిపారు. అయితే, వారింకా వాటిని ఇవ్వలేదన్నారు.

Advertisement
Advertisement