త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Theenmar Mallanna | బీసీల రాజ్యాధికారం కోసం మ‌ల్ల‌న్న తొలి అడుగు.. గోల్కొండ కోట నుంచి రాజ్యాధికార యాత్ర షురూ

Theenmar Mallanna | వీరత్వానికి ప్రతీక, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పాలించిన చ‌రిత్రాత్మక గోల్కొండ కోట నుంచి బీసీల రాజ్యాధికార యాత్ర ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ గోల్కొండ కోటపై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

S

Telangana | Published On Sep 17, 2026, 1.14 pm IST

Theenmar Mallanna | బీసీల రాజ్యాధికారం కోసం మ‌ల్ల‌న్న తొలి అడుగు.. గోల్కొండ కోట నుంచి రాజ్యాధికార యాత్ర షురూ
Advertisement

Theenmar Mallanna |  త్రినేత్ర‌.న్యూస్‌: వీరత్వానికి ప్రతీక, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పాలించిన చ‌రిత్రాత్మక గోల్కొండ కోట నుంచి బీసీల రాజ్యాధికార యాత్ర ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ గోల్కొండ కోటపై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి బీసీ రాజ్యాధికార యాత్రలో తొలి అడుగు వేశారు. తెలంగాణలో బీసీల విద్యా, ఉపాధి, రాజకీయ సాధికారత సాధించడమే ల‌క్ష్యం ఈ పాద‌యాత్ర ప్రారంభించిన‌ట్లు మ‌ల్ల‌న్న ప్ర‌క‌టించారు.

ఈ పాద‌యాత్ర సంద‌ర్భంగా పార్టీ నాయకులు, బీసీలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బలమైన బీసీ సమాజం - బలమైన తెలంగాణ అనే నినాదంతో వెనుకబడిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టారు. ఈ యాత్రకు మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ స్వయంగా ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement