త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Rao | ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఎక‌రం కూడా లేద‌న్న‌డు.. ఇప్పుడు వేల కోట్ల భూములెలా వ‌చ్చాయ్‌?

Ponguleti Srinivas Rao | తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్‌స‌భ ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ తెలిపార‌ని.. మ‌రి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.

S

Telangana | Published On Sep 17, 2026, 2.38 pm IST

Ponguleti Srinivas Rao | ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఎక‌రం కూడా లేద‌న్న‌డు.. ఇప్పుడు వేల కోట్ల భూములెలా వ‌చ్చాయ్‌?
Advertisement
  • అఫిడ‌విట్‌లో త‌ప్పులు రాసి మోసం చేశారా? ప్ర‌జ‌ల‌కు అబద్ధాలు చెప్తున్న‌రా?
  • రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్‌

Ponguleti Srinivas Rao | త్రినేత్ర‌.న్యూస్‌: తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్‌స‌భ ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ తెలిపార‌ని.. మ‌రి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా అని అన్నారు. ఈమేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. సున్నా ఎకరాల నుంచి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ అని ఆరోపించారు.

ఎన్నికల అఫిడవిట్‌తో కల్వకుంట్ల ముఠా అడ్డంగా దొరికింది. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తరువాత అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్‌కు భూములు భారీగా పెరిగిన విషయం స్వయంగా కేసీఆర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ల ద్వారా స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారులకు అప్పులే మిగిలాయి. కానీ కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి? ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా!

ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద లక్షల కోట్ల ఆస్తులను కల్వకుంట్ల కుటుంబం అక్రమంగా సంపాదించుకున్న‌ది. పుట్టుకతోనే కేసీఆర్‌కు వందల ఎకరాలు ఉన్నాయని డ్రామారావు బొంకుతున్నాడు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులు రాసి మోసం చేసారా? లేదా ప్రజలకు అబద్దాలు చెప్తున్నారా? అని పొంగులేటి నిల‌దీశారు.

Advertisement
Advertisement