త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Enquiry on KCR Lands | రేవంత్ ఆదేశం.. కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌పై విచార‌ణ షురూ

Enquiry on KCR Lands | ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఎర్రవల్లిలోని కేసీఆర్‌ (KCR) ఫామ్‌హౌస్ భూములపై గురువారం సమగ్ర విచారణ షురువైంది. ఈమేరకు మర్కుక్ రెవెన్యూ కార్యాలయంలో అధికారులు ఫైళ్ల ప‌రిశీలన చేప‌ట్టారు.

S

Telangana | Published On Sep 17, 2026, 1.37 pm IST

Enquiry on KCR Lands | రేవంత్ ఆదేశం.. కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌పై విచార‌ణ షురూ
Advertisement

Enquiry on KCR Lands | త్రినేత్ర‌.న్యూస్‌: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఎర్రవల్లిలోని కేసీఆర్‌ (KCR) ఫామ్‌హౌస్ భూములపై గురువారం సమగ్ర విచారణ షురువైంది. ఈమేరకు మర్కుక్ రెవెన్యూ కార్యాలయంలో అధికారులు ఫైళ్ల ప‌రిశీలన చేప‌ట్టారు. శాసనసభ వేదికగా 22ఏ నిషేధిత భూముల అంశంపై నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ పై సంచలన ప్రకటన చేసిన విష‌యం తెలిసిందే.

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, అందులో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ/అసైన్డ్ భూమి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ భూముల రికార్డులు, గత లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఫామ్‌హౌస్ భూముల వాస్తవాలను తేల్చేందుకు రెవెన్యూ అధికారులు, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు 30 రోజుల కాలపరిమితిని విధించారు. నిర్ణీత గడువులోగా నివేదిక ఇవ్వని పక్షంలో బాధ్యులైన అధికారులు, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అసలు అక్కడ ఎంత భూమి ఉంది? కేసీఆర్ ఎంత కొనుగోలు చేశారు? ప్రభుత్వ భూమి ఎవరి అధీనంలో ఉందనే విషయాలపై తక్షణమే కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు.

ధరణి పోర్టల్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో దాదాపు లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ, కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్ల మీద 9 జిల్లాల్లోని 31 గ్రామాల్లో దాదాపు 439 ఎకరాల భూములు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సభలో లెక్కలు చదివి వినిపించారు. ఈ అక్రమాలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందాన్ని (SET) ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూమి అని తేలితే వెంట‌నే స్వాధీనం చేసుకుని రాష్ట్రంలోని పేద దళిత కుటుంబాలకు అర ఎకరం చొప్పున సుమారు 800 కుటుంబాలకు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

కాగా ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చారు. కేసీఆర్ ఆస్తులు, రేవంత్ ఆస్తుల‌పై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విచార‌ణ‌కు సిద్ధ‌మ‌ని స‌వాల్ విసిరారు. మరోవైపు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన ఆస్తులపై సీబీఐ (CBI) చేత విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న దానికంటే ఒక్క గజం భూమి అదనంగా ఉన్నట్లు తేలినా ప్రభుత్వానికి ఇచ్చేస్తానని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement