త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arup Chakraborty Lokpal Case | ఆ పార్టీ మారగానే అదృష్టమొచ్చిందా?.. ఎంపీపై కేసులన్నీ కొట్టివేసిన లోక్‌పాల్

తృణమూల్ కాంగ్రెస్ వీడి వేరే పార్టీలో చేరిన కొద్ది నెలలకే ఎంపీ అరూప్ చక్రవర్తికి లోక్‌పాల్ ఊరటనిచ్చింది. ఆయనపై ఉన్న ఆరోపణలన్నీ నిరాధారమని సీబీఐ తేల్చింది.

J

National | Published On Sep 17, 2026, 1.40 pm IST

Arup Chakraborty Lokpal Case | ఆ పార్టీ మారగానే అదృష్టమొచ్చిందా?.. ఎంపీపై కేసులన్నీ కొట్టివేసిన లోక్‌పాల్
Advertisement
  • టీఎంసీని వీడి ఎన్‌సీపీఐ రెబల్ వర్గంలో చేరిన మూడు నెలలకే బంకురా ఎంపీ అరూప్ చక్రవర్తికి లోక్‌పాల్ నుంచి ఊరట
  • ఆయనపై నమోదైన ఆరు ప్రధాన ఆరోపణలు నిరాధారమైనవని ఆగస్టు 28, 2026 నాటి సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ స్పష్టం
  • భూ ఆక్రమణలు, అనధికారిక వసూళ్లు, చిల్డ్రన్స్ పార్క్ లైసెన్స్ రద్దు వంటి ఆరోపణలపై సీబీఐ సుమారు 45 పత్రాలను పరిశీలించి ఈ నివేదిక
  • బెంచ్ ఆదేశాల మేరకు గతంలో సీబీఐ విచారణకు ఆదేశించగా, తాజాగా విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని తేల్చేశారు

Arup Chakraborty Lokpal Case | త్రినేత్ర.న్యూస్ : తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీని వీడి రెబల్ ఎన్‌సీపీఐ వర్గంలో చేరిన బంకురా లోక్‌సభ ఎంపీ అరూప్ చక్రవర్తికి భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన అవినీతి, అక్రమాల ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చిన లోక్‌పాల్, ఆ కేసులను కొట్టివేసింది. పార్టీ మారిన మూడు నెలల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సీబీఐ ప్రిలిమినరీ విచారణలో ఏముంది?

ఎంపీ అరూప్ చక్రవర్తిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా లోక్‌పాల్, లోకాయుక్త చట్టం-2013 ప్రకారం.. సెక్షన్ 20 కింద ప్రిలిమినరీ ఎంక్వైరీ (PI) జరపాలని గతంలో నవంబర్ 21, 2025న బెంచ్ సీబీఐని ఆదేశించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (IO).. సుమారు 45కు పైగా డాక్యుమెంట్లు సేకరించి, ఆరుగురు సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఎంపీ స్పందనను కూడా పరిగణలోకి తీసుకుంటూ ఆగస్టు 28, 2026న సీబీఐ తన ప్రిలిమినరీ ఎంక్వైరీ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం ఎంపీపై మోపబడిన ఆరు ఆరోపణలు కూడా రుజువు కాలేదని తేలింది.

ఆరు ఆరోపణలు నిరాధారం

ఎంపీ అరూప్ చక్రవర్తి తన తమ్ముడు ఆశిష్ చక్రవర్తి ద్వారా అక్రమ కార్యకలాపాలు నడిపిస్తున్నారని, స్థానికులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారన్న తొలి ఆరోపణకు తగిన ఆధారాలు లేవని తేలింది. అలాగే మేజియా బ్లాక్‌లోని సుచిత్ర చిల్డ్రన్స్ అండ్ రిక్రియేషన్ పార్క్ ట్రేడ్ లైసెన్స్ రద్దు, అనధికారిక ఎంట్రీ ఫీజుల వసూలు వంటి రెండో ఆరోపణపై కూడా సమగ్రంగా దర్యాప్తు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. మొత్తంగా ఎంపీపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని సీబీఐ తేల్చడంతో, ఆయనకు చట్టపరంగా పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

Advertisement
Advertisement