Toxic Adulterated Milk | మార్కెట్లో 2.3 కోట్ల లీటర్ల విషపూరిత కల్తీ పాలు.. తనిఖీల్లో షాకింగ్ విషయాలు
Toxic Adulterated Milk | మహారాష్ట్ర (Maharashtra)లో పాల కల్తీ దందా గుట్టు బయటపడింది. ధారాశివ్ జిల్లా (Dharashiv) భూమ్ తాలూకా (Bhoom taluka)లో పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
Toxic Adulterated Milk | మహారాష్ట్ర (Maharashtra)లో పాల కల్తీ దందా గుట్టు బయటపడింది. ధారాశివ్ జిల్లా (Dharashiv) భూమ్ తాలూకా (Bhoom taluka)లో పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సేల్స్ రిజిస్టర్లను విశ్లేషించగా.. గత ఆరు నెలల్లో మార్కెట్లో 2.3 కోట్ల లీటర్ల విషపూరిత కల్తీ పాలు అమ్మినట్లు (Toxic Adulterated Milk) తేలింది. ఈ పాల విలువ రూ. 9.21 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ కల్తీ పాల తయారీకోసం 2,30,470 కిలోల నాణ్యత లేని పాలపొడిని ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల సింథటిక్ (ఇది 10% కల్తీకి సమానం) పాలను కలిపినట్లు వెల్లడైంది. భూమ్ ప్రాంతంలోని పాల సేకరణ కేంద్రాల నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 2.3 కోట్ల లీటర్లకు పైగా కల్తీ పాలు సరఫరా అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ కల్తీపాలు చిక్కగా కనిపించేందుకు, అవసరమైన కొవ్వు స్థాయిలను పెంచేందుకు నిందితులు డిటర్జెంట్ పౌడర్, పామాయిల్, నాసిరకం మిల్క్ పౌడర్, రసాయనాలు వాడినట్లు అధికారులు గుర్తించారు. ఈ రసాయనాలతో నిండిన పాలను తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటాయని.. ఇది పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు ప్రాణాంతకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Ghost Hostels | నాలుగేండ్లుగా ఒక్క విద్యార్థీ లేడు.. అయినా ఆ హాస్టళ్లకు రూ.1.62 కోట్ల నిధులు
జులై 14, 2026

Beneficiaries Removed | ఆ పథకం నుంచి 92 లక్షల మంది లబ్దిదారుల తొలగింపు..
జులై 13, 2026

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
జులై 10, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | 2028 జూన్ 2 నాటికి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు పూర్తి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Mutual Funds | షేర్లు, మ్యూచువల్ ఫండ్లను అమ్మితే వచ్చే లాభంపై పన్ను చెల్లించాలా.. రూల్స్ ఎలా ఉన్నాయి..
- ●Hafiz Saeed | హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఎన్ఐఏ కోర్టు
- ●RRR | ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అనుమతులివ్వండి.. నితిన్ గడ్కరీని కోరిన సీఎం రేవంత్
- ●Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ట్విస్ట్ - ఊరువాడతో తనకు సంబంధం లేదన్న యంగ్ టైగర్
- ●N Ramachander Rao | సింగరేణి కార్మికుల హక్కులను కాపాడేది బీజేపీనే : ఎన్ రామచందర్ రావు

CM Revanth Reddy | 2028 జూన్ 2 నాటికి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు పూర్తి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

Mutual Funds | షేర్లు, మ్యూచువల్ ఫండ్లను అమ్మితే వచ్చే లాభంపై పన్ను చెల్లించాలా.. రూల్స్ ఎలా ఉన్నాయి..

Hafiz Saeed | హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఎన్ఐఏ కోర్టు

RRR | ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అనుమతులివ్వండి.. నితిన్ గడ్కరీని కోరిన సీఎం రేవంత్



