CEC Gyanesh Kumar | సీఈసీపై ప్రతిపక్షాల అభిశంసన తీర్మానం నోటీసు.. నేడు సభలో ప్రవేశపెట్టే అవకాశం
CEC Gyanesh Kumar | తమపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆ తీర్మానం వీగిపోయింది.
CEC Gyanesh Kumar | తమపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆ తీర్మానం వీగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విపక్షాలు కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar)ని టార్గెట్ చేశాయి. సీఈసీపై అభిశంసనకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
సీఈసీని పదవి నుంచి తొలగించాలని కోరుతూ సుమారు 193 మంది ఎంపీలు నోటీసుపై సంతకం చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. వీరిలో 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఈ నోటీసు నేడు పార్లమెంట్‌కు సమర్పించే అవకాశం ఉందని తెలిసింది. ఈ నోటీసు లోక్‌సభ లేదా రాజ్యసభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నోటీస్‌పై సంతకం చేసేందుకు ఎంపీలు ఎంతో ఉత్సాహాన్ని చూపించారని ఒక విపక్ష ఎంపీ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు నిరసనగానే విపక్ష ఎంపీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సర్ పేరుతో ఎన్నికల సంఘం ఏకపక్షంగా విపక్ష పార్టీల ఓటర్లను తొలగిస్తోందని, ఈ చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని ఇండియా కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించమని కోరడానికి 100 మంది లోక్‌సభ ఎంపీల సంతకాలు అవసరం కాగా, 50 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇండియా కూటమిలోని అన్ని పార్టీల ఎంపీలు ఈ నోటీస్‌పై సంతకాలు చేశారు. ఇక సీఈసీని తొలగించాలని కోరుతూ నోటీస్ ఇవ్వనుండటం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం.
Also Read..
PM Modi | కొవిడ్ తరహాలోనే.. ఎల్పీజీ సంక్షోభాన్ని మనం అధిగమిస్తాం : ప్రధాని మోదీ
Trisha | విజయ్ విడాకుల వివాదం - చిరంజీవి విశ్వంభర ప్రమోషన్స్‌కు త్రిష దూరం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Movies | టాలీవుడ్ ఇలాఖాలో తెలంగాణ ధూమ్‌ధామ్
- ●Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..
- ●Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
- ●Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు

Telangana Movies | టాలీవుడ్ ఇలాఖాలో తెలంగాణ ధూమ్‌ధామ్

Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..

Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..





