త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Republic Day Parade | రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో 17 రాష్ట్రాల శ‌కటాల‌కు స్థానం.. తెలుగు రాష్ట్రాల‌కు నిరాశ‌

Republic Day Parade | గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించ‌నున్న ప‌రేడ్‌ (Republic Day Parade) లో భాగంగా దేశ‌వ్యాప్తంగా మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు శ‌క‌టాలు ప్ర‌ద‌ర్శించేందుకు అవ‌కాశం ద‌క్కింది. రెండు తెలుగు రాష్ట్రాల‌కూ అవ‌కాశం ద‌క్క‌లేదు.

A

National | Published On Jan 23, 2026, 2.24 pm IST

Republic Day Parade | రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో 17 రాష్ట్రాల శ‌కటాల‌కు స్థానం.. తెలుగు రాష్ట్రాల‌కు నిరాశ‌
Advertisement

Republic Day Parade | త్రినేత్ర‌.న్యూస్ : గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించ‌నున్న ప‌రేడ్‌ (Republic Day Parade) లో భాగంగా దేశ‌వ్యాప్తంగా మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు శ‌క‌టాలు ప్ర‌ద‌ర్శించేందుకు అవ‌కాశం ద‌క్కింది. మొత్తం 30 శ‌క‌టాల‌లో 17 వివిధ రాష్ట్రాల‌కు పోగా మిగిలిన 13 వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖ‌లు, విభాగాల‌కు చెందిన‌వి. పరేడ్‌లో ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల‌కూ అవ‌కాశం ద‌క్క‌లేదు. ఈ ఏడాది ప్ర‌ధాన థీమ్ ‘స్వతంత్రత కా మంత్ర: వందే మాతరం’ మరియు ‘సమృద్ధి కా మంత్ర: ఆత్మనిర్భర్ భారత్’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌కు మూడు సార్లే అవ‌కాశం..

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించిన త‌రువాత ఇప్ప‌టికి 11 రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లు జ‌ర‌గ‌గా అందులో మూడు సార్లు మాత్ర‌మే తెలంగాణ శ‌క‌టానికి అవ‌కాశం ద‌క్కింది. తొలిసారిగా 2015, ఆ త‌రువాత 2020, 2024 ప‌రేడ్‌ల‌లో తెలంగాణ శ‌క‌టం పాల్గొంది. కొన్ని సార్లు రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి ద‌ర‌ఖాస్తు చేయ‌క‌పోవ‌డం, మ‌రికొన్ని సార్లు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్ప‌టికీ, వివిధ కార‌ణాల‌తో ఎంపిక కాలేదు. 2015లో బోనాల థీమ్‌తో, 2020లో తెలంగాణ సంస్కృతి, బ‌తుక‌మ్మ థీమ్‌తో, 2024లో మ‌ద‌ర్ ఆఫ్ డెమోక్ర‌సీ థీమ్‌తో శ‌క‌టాలు ప్ర‌ద‌ర్శించారు.

అవ‌కాశం ల‌భించిన రాష్ట్రాలివే..

2026 రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో 17 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు శ‌క‌టాలు ప్ర‌ద‌ర్శించేందుకు అనుమ‌తించారు. ఇందులో అసోం, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, జ‌మ్మూ క‌శ్మీర్‌, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, మ‌ణిపూర్‌, నాగాలాండ్‌, ఒడిశా, పుదుచ్చేరి, రాజ‌స్తాన్‌, త‌మిళ‌నాడు, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌ల‌కు అవ‌కాశం ద‌క్కింది.

Advertisement

తాజావార్తలు

Advertisement