Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస.. మృతదేహాలతో సీఎం బంగ్లాకు
Manipur Violence | మణిపూర్‌లో మరోసారి హింస (Manipur Violence) చెలరేగింది. కట్టెలు సేకరించేందుకు కొండ ప్రాంతానికి వెళ్లిన స్థానికులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు నిరసనగా స్థానికులు ఇద్దరు బాధితుల మృతదేహాలను ఇంఫాల్ (Imphal)కు తీసుకువచ్చి ముఖ్యమంత్రి నివాసం ముందు ఉంచి ఆందోళన చేపట్టారు.
Manipur Violence | త్రినేత్ర న్యూస్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస (Manipur Violence) చెలరేగింది. ఇంఫాల్ (Imphal) తూర్పు జిల్లాలో సోమవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నుంగ్సమ్ కొండల (Nongsum Hills) సమీపంలోని ఉయుంపుక్‌లో (Uyumpok) అనుమానిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
ఇంఫాల్ తూర్పు, కుకీ ప్రాబల్య కంగ్పోక్పి జిల్లాల సరిహద్దు ప్రాంతానికి సమీపంలో కట్టెలు సేకరించేందుకు వెళ్లిన వారిపై ఈ దాడి జరిగినట్లు స్థానిక ఎమ్మెల్యే తొక్చోమ్ లోకేశ్వర్ సింగ్ తెలిపారు. మృతులు అరుబం రోనిల్ (35), లారెన్ లక్పామ్ ఇనాయోబి (44), క్షేత్రిమయుమ్ సుశీల్ (32)గా గుర్తించారు. గాయపడిన మరో ఇద్దరు వ్యక్తులు ఇంఫాల్‌లోని రాజ్ మెడిసిటీలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు అధికారులు జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ దాడి ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. ఘటనకు నిరసనగా స్థానికులు ఇద్దరు బాధితుల మృతదేహాలను ఇంఫాల్‌కు తీసుకువచ్చి ముఖ్యమంత్రి నివాసం (Chief Minister's Bungalow) ముందు ఉంచి ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన భద్రతా దళాలు నిరసనకారులను చెదరొగట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. ఆ సమయంలో నివాసంలో సీఎం ఉన్నారా..? లేదా..? అనేది తెలియరాలేదు. ఈ ఘటనతో ఇంఫాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read..
రైళ్లలో గట్టిగా పాటలు వింటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు
అణు విద్యుత్ రంగంలో భారీ అవకాశాలు.. ఈ రెండు షేర్లపై ఓ లుక్కేయండి..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

India | భారత్ నుంచి సింగపూర్‌కు 3,000 కి.మీ. విద్యుత్ కారిడార్..
అక్టోబర్ 10, 2026

Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?
సెప్టెంబర్ 4, 2026

Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Telangana | ఎల్ నినోపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
- ●Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా రష్మిక బతుకమ్మ సంబురం - ఫొటోలు చూశారా
- ●Chariot Festival | స్వర్ణరథంపై శ్రీనివాసుడి దర్శనం.. గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధులు
- ●Southern Railway | రైళ్లలో గట్టిగా పాటలు వింటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు
- ●US Middle East Travel Alert 2026 | మిడిల్ ఈస్ట్‌లో ముదురుతున్న సంక్షోభం: సౌదీ, యూఏఈ సహా 12 దేశాలకు అమెరికా 'సెక్యూరిటీ అలర్ట్'
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..

Telangana | ఎల్ నినోపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా రష్మిక బతుకమ్మ సంబురం - ఫొటోలు చూశారా

Chariot Festival | స్వర్ణరథంపై శ్రీనివాసుడి దర్శనం.. గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధులు

Southern Railway | రైళ్లలో గట్టిగా పాటలు వింటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు



