త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IED Blast | క‌ర్రెగుట్టల్లో పేలిన ఐఈడీలు.. 11 మంది జ‌వాన్ల‌కు తీవ్ర గాయాలు

IED Blast | తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉన్న క‌ర్రెగుట్ట‌ల్లో మావోయిస్టులు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. క‌ర్రెగుట్ట అడ‌వుల్లో పాతిపెట్టిన ఐఈడీలు ఆదివారం సాయ‌త్రం వ‌రుస‌గా పేలాయి. ఈ పేలుళ్ల ధాటికి 11 మంది జ‌వాన్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి.

S

National | Published On Jan 26, 2026, 4.02 pm IST

IED Blast | క‌ర్రెగుట్టల్లో పేలిన ఐఈడీలు.. 11 మంది జ‌వాన్ల‌కు తీవ్ర గాయాలు
Advertisement

IED Blast | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉన్న క‌ర్రెగుట్ట‌ల్లో మావోయిస్టులు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. క‌ర్రెగుట్ట అడ‌వుల్లో పాతిపెట్టిన ఐఈడీలు ఆదివారం సాయ‌త్రం వ‌రుస‌గా పేలాయి. ఈ పేలుళ్ల ధాటికి 11 మంది జ‌వాన్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. వారిని ఆర్మీ హెలికాప్ట‌ర్‌లో రాయ్‌పూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

క‌ర్రెగుట్ట‌ల్లో మావోయిస్టుల క‌ద‌లిక‌, ఐఈడీలు అమ‌ర్చిన‌ట్లు భ‌ద్ర‌తా సంస్థ‌ల‌కు విశ్వ‌స‌నీయ స‌మాచారం అందింది. దీంతో డీఆర్‌జీ, కోబ్రా బెటాలియ‌న్‌కు చెందిన జ‌వాన్లు కూంబింగ్ చేప‌ట్టారు. కూంబింగ్ నిర్వ‌హిస్తుండ‌గా.. ఐఈడీలు పేలిపోయాయి. దీంతో ప‌ది మంది డీఆర్‌జీ సిబ్బంది, ఒక‌రు కోబ్రా బెటాలియ‌న్‌కు చెందిన స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ రుద్రేష్ సింగ్ ఉన్నారు. ఆయ‌న‌తో పాటు ఇద్ద‌రు డీఆర్‌జీ సిబ్బంది కాళ్ల‌కు గాయాలు కాగా, మ‌రో ముగ్గురి కంటికి తీవ్ర గాయాలైన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం వీరంతా రాయ్‌పూర్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

మావోయిస్టుల‌కు స్థావ‌రంగా ఉన్న క‌ర్రెగుట్ట‌ల్లో గ‌తేడాది 21 రోజుల పాటు విస్తృతంగా ఆప‌రేష‌న్ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. 31 మంది మావోయిస్టులు హత‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో 35 ఆయుధాలు, 450 ఐఈడీలు, పెద్ద సంఖ్య‌లో డిటోనేట‌ర్లు, పేలుడు ప‌దార్థాలు, వైద్య, విద్యుత్ ప‌రిక‌రాల‌ను భారీ సంఖ్య‌లో స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement