RTC Bus | పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే..
RTC Bus | స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లల్లో వారినే కూర్చోనిద్దాం. ఇలాంటి బోర్డులు మనం ఆర్టీసీ బస్సుల్లో చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి..
RTC Bus | త్రినేత్ర.న్యూస్: స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లల్లో వారినే కూర్చోనిద్దాం. ఇలాంటి బోర్డులు (Board) మనం ఆర్టీసీ బస్సుల్లో (RTC Bus) చూస్తూనే ఉంటాం. గతంలో బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చునే వారు. దీంతో దూర ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో సీట్లు రిజర్వు చేసింది. దీంతో వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దామని ఆర్టీసీ అధికారులు బస్సుల్లో బోర్డులు ఏర్పాటు చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.
మహిళలకు ఉచిత ప్రయాణం (Free Bus For Women) కల్పించడంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. మగవారు, ఇతర ప్రయాణికులు బస్సు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. డబ్బులు పెట్టి టికెట్టు కొన్నుకొని ప్రయాణించే తమకు సీట్లు దొరకడం లేదంటూ వాపోతున్నారు. ఇదేవిషయమై ఆర్టీసీ అధికారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్‌లో (Suryapet Bus Stand) ఏర్పాటు చేసిన ఓ బోర్డు ఇప్పుడు అందరినీ ఆకర్శిస్తున్నది. `పురుషులను గౌరవించడం మన సంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిద్దాం` అని రాసిన బోర్డును వేలాడదీశారు. దీంతో ప్రయాణికులు ఆసక్తిగా ఆ బోర్డును చూస్తున్నారు. `ట్రెండ్ మారింది గురూ..` అని చెప్పుకుంటున్నారు.
తాజావార్తలు
- ●Gallantry Awards | 1,057 మందికి కేంద్ర పతకాలు.. తెలంగాణ నుంచి 15 మంది ఎంపిక
- ●Galaxy Z Fold 8 | గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సేల్స్ షురూ.. 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ..
- ●Fruit and vegetables | పండ్లు, కూరగాయల్లో అధిక పురుగుల మందులు.. తెలంగాణనే టాప్
- ●Vira Video | చాటలో బియ్యం చెరుగుతున్న అమ్మ.. కూతురు ఏం చేసిందో చూడండి..
- ●Gold And Silver Prices Today | భారీగా పడిపోయిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో యుద్ధం టెన్షన్..
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హరీశ్ రావు

Gallantry Awards | 1,057 మందికి కేంద్ర పతకాలు.. తెలంగాణ నుంచి 15 మంది ఎంపిక

Galaxy Z Fold 8 | గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సేల్స్ షురూ.. 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ..

Fruit and vegetables | పండ్లు, కూరగాయల్లో అధిక పురుగుల మందులు.. తెలంగాణనే టాప్

Vira Video | చాటలో బియ్యం చెరుగుతున్న అమ్మ.. కూతురు ఏం చేసిందో చూడండి..






