త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pradhan Mantri Rashtriya Bal Puraskar | ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో సైనికులకు టీ, లస్సీ అందించిన 10 ఏళ్ల బాలుడికి అవార్డు

దేశభక్తి అనేది వయసును బట్టి రాదు.. మన చేతలను బట్టి వస్తుందని నిరూపించిన ఈ బాలుడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను తన చేతుల మీదుగా అందజేశారు.

J

National | Published On Dec 27, 2025, 8.17 pm IST

Pradhan Mantri Rashtriya Bal Puraskar | ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో సైనికులకు టీ, లస్సీ అందించిన 10 ఏళ్ల బాలుడికి అవార్డు
Advertisement

Pradhan Mantri Rashtriya Bal Puraskar | 10 ఏళ్ల వయసులోనే దేశానికి సేవ చేసే అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టం. అది 10 ఏళ్ల శ్రవణ్ సింగ్ అనే బాలుడికి దక్కింది. 10 ఏళ్ల వయసులోనే గొప్ప మనసును చాటుకున్న శ్రవణ్ సింగ్‌ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందించింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో సైనికులకు ఈ బాలుడు మంచినీళ్లు, టీ, పాలు, లస్సీ అందించాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కి చెందిన ఈ బాలుడి ఇంటి దగ్గరే ఇండియా-పాకిస్థాన్ బార్డర్ ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో చాలా మంది సైనికులు ఆ బార్డర్ దగ్గరే ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఒకేసారి సైనికులంతా తన ఊరికి రావడంతో వాళ్లు ఈ దేశం కోసం ఏదో చేయడానికే వచ్చారు.. అని భావించిన శ్రవణ్ వాళ్ల కోసం ప్రతి రోజు పాలు, చాయ్, లస్సీ, మంచినీళ్లు అందజేశాడు. దేశభక్తి అనేది వయసును బట్టి రాదు.. మన చేతలను బట్టి వస్తుందని నిరూపించిన ఈ బాలుడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను తన చేతుల మీదుగా అందజేశారు.

ఫిరోజ్‌పూర్‌కి దగ్గర్లో ఉన్న చాక్ తరన్ వాలి అనే గ్రామం శ్రవణ్‌ది. ఆపరేషన్ సిందూర్ సమయంలో బార్డర్ వద్ద తీవ్ర భయాందోళన వ్యక్తం అవుతున్నా ఎంతో ధైర్యంతో బార్డర్ వద్దకు వెళ్లి మన దేశ సైనికులకు మంచినీళ్లు, పాలు, చాయ్ అందించి తన కృతజ్ఞత చాటుకున్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement