త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virosh | పదో తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్స్.. సొంతూరులో విరోష్ ప్రకటన

ఇటీవలే రష్మిక మందన్నను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. తన సొంత ఊరు నాగర్ కర్నూలు జిల్లా తుమ్మన్‌పేటలో సందడి చేశారు. నవ దంపతులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి, గ్రామస్తులకు విందు ఇచ్చారు. అలాగే అచ్చంపేట డివిజన్‌లోని విద్యార్థులకు భారీ స్కాలర్ షిప్స్ కూడా ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్నారు.

J

Movies | Published On Mar 2, 2026, 11.00 pm IST

Virosh | పదో తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్స్.. సొంతూరులో విరోష్ ప్రకటన
Advertisement

Virosh | త్రినేత్ర.న్యూస్ : ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్నను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరికి వెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లా, బల్మూరు మండలంలోని తన స్వగ్రామం 'తుమ్మన్‌పేట'లో ఆయన పెళ్లి తర్వాత తొలిసారి సందడి చేశారు. నవ దంపతులకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు.

పల్లెటూరి వాతావరణంలో పెళ్లి వేడుకలు

పెళ్లైన తర్వాత తొలిసారిగా ఊరికి వచ్చిన విజయ్ దంపతులకు, ఆయన కుటుంబ సభ్యులకు తుమ్మన్‌పేట గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మన్‌పేటలోని తమ స్వగృహంలో విజయ్ - రష్మిక దంపతులు శాస్త్రోక్తంగా సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు. అనంతరం స్థానిక ప్రజలందరికీ విజయ్ కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో పెళ్లి విందును ఏర్పాటు చేశారు. అభిమాన హీరో తమ మధ్యనే ఉండి భోజనాలు వడ్డించడంతో స్థానికులు మురిసిపోయారు.

ఇకపై తరచుగా వస్తాను: విజయ్ దేవరకొండ

ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ ఎమోషనల్ గా మాట్లాడారు. "నా సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మా జంటకు ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మన గ్రామానికి చాలా మంచి పనులు చేయాలని నా మనసులో ఉంది. వాటిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మాకు సొంత ఇల్లు, వ్యవసాయ పొలం కూడా ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి నేను తరచుగా మన గ్రామానికి వస్తుంటాను" అని విజయ్ వివరించారు.

విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ప్రకటన

తనకు ఎంతో ఇష్టమైన సొంతూరు ప్రాంతంలో చదువుకుంటున్న విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఒక తీపికబురు అందించారు. అచ్చంపేట డివిజన్ పరిధిలో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులకు 'విజయ్ దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్' తరపున స్కాలర్ షిప్స్ (ఉపకార వేతనాలు) అందిస్తామని ఆయన ప్రకటించారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement