త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | గ్లోబల్ స్టేజ్‌పై నేష‌న‌ల్ క్ర‌ష్ …. టోక్యో యానిమే అవార్డ్స్‌ ప్ర‌జెంట‌ర్‌గా ర‌ష్మిక‌

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న గ్లోబ‌ల్ ఈవెంట్‌లో సంద‌డి చేయ‌బోతుంది. మే నెలాఖ‌రున టోక్యోలో జ‌రుగ‌నున్న గ్లోబ‌ల్ యానిమే అవార్డ్స్ వేడుక‌కు ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ది. ఈ అవార్డు ఈవెంట్‌లో ర‌ష్మిక పాల్గొన‌డం ఇది రెండోసారి....

N

Entertainment | Published On Apr 28, 2026, 3.52 pm IST

Rashmika Mandanna | గ్లోబల్ స్టేజ్‌పై నేష‌న‌ల్ క్ర‌ష్ …. టోక్యో యానిమే అవార్డ్స్‌ ప్ర‌జెంట‌ర్‌గా ర‌ష్మిక‌
Advertisement

Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లు ర‌ష్మిక మంద‌న్న గ్లోబ‌ల్ స్టేజ్‌పై మెర‌వ‌బోతుంది. ప్ర‌తిష్టాత్మ‌క గ్లోబ‌ల్ యానిమే అవార్డ్స్ వేడుక‌కు ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ది. ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఏడ‌డుగులు వేసింది ర‌ష్మిక మంద‌న్న‌. పెళ్లి త‌ర్వాత సినిమా షూటింగ్‌ల‌తో బిజీ అయ్యింది. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో మైసా షూటింగ్‌లో ఉంది. ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీలో ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో ర‌ష్మిక మంద‌న్న క‌నిపించ‌బోతున్న‌ది. కేర‌ళ షెడ్యూల్‌లో కొరియ‌న్ ఫైట్ మాస్ట‌ర్ కీచా కంప‌క్డీ సార‌థ్యంలో ర‌ష్మిక మంద‌న్న‌పై భారీ ఫైట్ సీక్వెన్స్‌ల‌ను చిత్ర యూనిట్ తెర‌కెక్కిస్తోన్నారు.

ప‌దేళ్లుగా...

కాగా త్వ‌ర‌లో ర‌ష్మిక మంద‌న్న గ్లోబ‌ల్ ఈవెంట్‌లో సంద‌డి చేయ‌బోతున్న‌ది. యానిమేష‌న్ రంగంలో ప్ర‌తిభ‌ను చాటిన సినిమాలు, సిరీస్‌ల‌తో పాటు టెక్నీషియ‌న్ల‌కు గ‌త ప‌దేళ్లుగా అవార్డుల‌ను అంద‌జేస్తున్నారు. గ్లోబ‌ల్ యానిమే అవార్డ్స్ పేరుతో ప్ర‌తి ఏటా జ‌పాన్‌లోని టోక్యోలో ఈ అవార్డు సెల‌బ్రేష‌న్స్‌ జ‌రుగుతుంటాయి. ప‌దో ఎడిష‌న్ గ్లోబ‌ల్ యానిమే వేడుక‌లు ఈ ఏడాది మే 23న జ‌రుగ‌నున్నాయి.ఈ ప్ర‌తిష్టాత్మ‌క ఈవెంట్‌లో ర‌ష్మిక మంద‌న్న పాల్గొన‌బోతుంది. అవార్డ్ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది.ఇండియా నుంచి ఈ ఏడాది గ్లోబ‌ల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొన‌నున్న ఏకైక ఇండియ‌న్ సెలిబ్రిటీ ర‌ష్మిక కావ‌డం గ‌మ‌నార్హం.

రెండోసారి...

ప్ర‌జెంట‌ర్ హోదాలో ఈ యానిమే అవార్డ్ ఈవెంట్‌కు ర‌ష్మిక అటెండ్ కావ‌డం రెండోసారి. 2024లో ఈ అవార్డు ప్రదానోత్స‌వంలో పాల్గొన్న‌ది. గ్లోబ‌ల్ యానిమే అవార్డ్స్‌కు ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ తొలి భార‌తీయురాలిగా ర‌ష్మిక మంద‌న్న రికార్డును నెల‌కొల్పింది, మ‌రోసారి ఈ గ్లోబ‌ల్ ఈవెంట్‌లో ఆమె భాగం కాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

గ్లోబ‌ల్ యానిమేకు ర‌ష్మిక మంద‌న్న‌, దిగ్గ‌జ సింగ‌ర్ వీకెండ్ తో పాటు ప‌లువురు హాలీవుడ్ స్టార్స్‌ గెస్ట్‌లుగా హాజ‌రుకాబోతున్నార‌ట‌. వేడుక‌ల కోసం మే మూడో వారంలో ర‌ష్మిక టోక్యో వెళ్ల‌నున్న‌ట్లు చెబుతున్నారు.

మూడు సినిమాలు...

ప్ర‌స్తుతం తెలుగులో మైసాతో పాటు భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ర‌ణ‌బాలి పేరుతో ఓ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ మూవీ చేస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. హిందీలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించిన కాక్ టెయిల్ మూవీ జూన్ 19న రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమాలో బోల్డ్ రోల్‌లో ర‌ష్మిక న‌టిస్తోంది.

 

Advertisement
Advertisement